రోజూ గుడ్లు తినడం ఘోరం... ప్రొటీన్ కోసం ఈ 3 తినండి: సద్గురు ఆసక్తికర వ్యాఖ్యలు
- ప్రొటీన్, విటమిన్ బీ12 కోసం శాకాహారమే ఉత్తమమని వ్యాఖ్య
- గుడ్లకు బదులుగా కొన్ని దక్షిణాది సంప్రదాయ వంటకాల సూచన
- లక్ష్మీ చారు, పజయ సదం వంటివి తినడం మేలని హితవు
- ప్రముఖ క్రీడాకారులు శాకాహారులేనని గుర్తుచేసిన సధ్గురు
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్, ఆరోగ్యం మరియు ఆహారంపై తరచూ తనదైన శైలిలో విశ్లేషణలు అందిస్తుంటారు. తాజాగా ఆయన గుడ్ల వినియోగంపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. జిమ్ ట్రైనర్లు, పోషకాహార నిపుణులు, చివరికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కూడా గుడ్లను పోషకాలు నిండిన సరసమైన ఆహారంగా సిఫార్సు చేస్తుండగా, సద్గురు దీనికి పూర్తి భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తన ఇటీవలి ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో, రోజూ గుడ్లు తినడాన్ని "అత్యంత ఘోరమైన విషయం"గా ఆయన అభివర్ణించారు.
ఈక్వినాక్స్ (విషువత్తు- పగలు, రాత్రి సమానంగా ఉండే రోజు) తర్వాత కొంతమంది, ముఖ్యంగా మహిళల్లో శక్తి క్షీణించడం, నీరసంగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయని సద్గురు తెలిపారు. ఈ సమస్యను సరైన ఆహారంతో సరిదిద్దుకోకపోతే ఇబ్బందులు పెరుగుతాయన్నారు.
"ఒకప్పుడు మన ఇళ్లలోనే విటమిన్ బీ12 నిండిన ఎన్నో రకాల పదార్థాలను తయారు చేసుకుని తినేవాళ్లం. కానీ ఇప్పుడు బ్రెడ్, గుడ్లు వంటి వాటికి అలవాటు పడ్డాం" అని ఆయన ఆధునిక ఆహారపు అలవాట్లపై విమర్శలు గుప్పించారు.
ప్రోటీన్ కోసం గుడ్లు తినాలా?
"ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది?" అనే ప్రశ్నకు సద్గురు ఆసక్తికరమైన సమాధానమిచ్చారు. "ప్రపంచంలో అత్యంత బలమైన కండరాలున్న జంతువులు శాకాహారులే కదా? అదేవిధంగా, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన క్రీడాకారుల్లో చాలామంది శాకాహారులే" అని ఆయన గుర్తుచేశారు. ఉదాహరణగా నొవాక్ జొకోవిచ్, విరాట్ కోహ్లీ, లియోనెల్ మెస్సీ, టామ్ బ్రాడీ వంటి క్రీడా దిగ్గజాలను ఆయన ప్రస్తావించారు.
సద్గురు సూచించిన 3 సాంప్రదాయ వంటకాలు
గుడ్లకు ప్రత్యామ్నాయంగా ప్రోటీన్, విటమిన్ బీ12 పుష్కలంగా లభించే మూడు అద్భుతమైన దక్షిణ భారత సాంప్రదాయ వంటకాలను ఆయన సూచించారు.
1. లక్ష్మీ చారు (ఆంధ్రప్రదేశ్): ఇది మన తెలుగు రాష్ట్రాల్లోని ఒక సంప్రదాయ వంటకం. చింతపండు పులుసు, మసాలాలు, కరివేపాకు, పప్పుతో దీనిని తయారు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో అన్నం కడిగిన గంజి నీరు కూడా దీని తయారీకి ఉపయోగిస్తారు. పోషకాలను అందించే అద్భుతమైన వంటకం ఇది. వేడి అన్నంతో కలిపి తింటే దీని రుచి అమోఘంగా ఉంటుంది.
2. పళయ సదం (తమిళనాడు): మిగిలిపోయిన అన్నాన్ని రాత్రంతా నీటిలో నానబెట్టి పులియబెట్టడం ద్వారా ఈ వంటకాన్ని సిద్ధం చేస్తారు. ఇది వేసవిలో శరీరానికి చలువ చేస్తుంది. సహజసిద్ధమైన ఫెర్మెంటేషన్ ప్రక్రియ వల్ల ఇందులో ప్రోబయోటిక్స్ పెరిగి జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. దీనిని పెరుగు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఊరగాయతో కలిపి అల్పాహారంగా తీసుకుంటారు.
3. కూళ్ (తమిళనాడు/కర్ణాటక): రాగి, సజ్జ లేదా కంబు పిండిని పులియబెట్టి, నీళ్లు లేదా మజ్జిగతో కలిపి జావలా తయారుచేసే వంటకం ఇది. వేసవిలో శరీరాన్ని చల్లగా, హైడ్రేట్‌గా ఉంచుతుంది. ప్రోటీన్లు పుష్కలంగా ఉండే ఈ వంటకాన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఊరగాయ వంటి వాటితో కలిపి తింటారు.
ప్రోటీన్ శరీర నిర్మాణానికి, కండరాల మరమ్మత్తుకు, రోగనిరోధక శక్తికి అత్యవసరం. విటమిన్ బీ12 నాడీ వ్యవస్థ, మెదడు పనితీరు, జ్ఞాపకశక్తికి కీలకం. దీని లోపం వల్ల రక్తహీనత, అలసట వంటి సమస్యలు వస్తాయి. ఈ నేపథ్యంలో, ఆధునిక ఫాస్ట్ ఫుడ్ సంస్కృతిని పక్కనపెట్టి, మన పూర్వీకులు అందించిన ఇలాంటి పోషకాలు నిండిన ఇంటి వంటకాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని సద్గురు సందేశమిచ్చారు.