Advertisement

చిరంజీవి జోక్యంతో 'పర్సంటేజీ' నిర్ణయం వాయిదా.. రెంటల్ విధానంలోనే 'పెద్ది' సినిమా!

Chiranjeevi intervention postpones percentage decision for Peddi movie
  • తెలంగాణ ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య కొంతకాలంగా వివాదం
  • పెద్ది చిత్రం నుంచి పర్సంటేజీ విధానం కోసం ఎగ్జిబిటర్ల డిమాండ్
  • చిరంజీవితో భేటీ అయిన ఎగ్జిబిటర్లు
  • జూన్ 30 తర్వాత విడుదలయ్యే చిత్రాలకు పర్సంటేజీ వర్తింపజేస్తామన్న ఎగ్జిబిటర్లు
మెగాస్టార్ చిరంజీవితో ఎగ్జిబిటర్ల తాజా సమావేశం అనంతరం వివాదం ఓ కొలిక్కి వచ్చింది. తెలంగాణ ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య గత కొంతకాలంగా పర్సంటేజీ వివాదం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. పెద్ది చిత్రం నుంచి పర్సంటేజీ విధానం అమలు కావాల్సిందేనని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవితో తెలంగాణ ఎగ్జిబిటర్లు ఈరోజు సమావేశమయ్యారు. ఆయన జోక్యంతో పర్సంటేజీ విధానం నిర్ణయం వాయిదాపడింది.

దీంతో జూన్ 4వ తేదీన విడుదల కానున్న పెద్ది చిత్రంను రెంటల్ విధానంలోనే ప్రదర్శించాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించారు. జూన్ 30వ తేదీ తర్వాత విడుదలయ్యే చిత్రాలకు పర్సంటేజీ విధానం వర్తింపజేస్తామని వారు తెలిపారు. తెలంగాణ ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయంపై చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ఫిల్మ్ ఛాంబర్ కమిటీ నివేదిక మేరకు ముందుకు సాగాలని సూచించారు.
Advertisement
Chiranjeevi
Peddi Movie
Ram Charan
Telangana Exhibitors
Percentage System
Film Chamber Committee

More Telugu News