కర్ణాటకపై సీఎం విజయ్ చూపు.. బెంగళూరు మున్సిపల్ ఎన్నికల్లో ‘టీవీకే’ పోటీకి సిద్ధం?

TVK Party Expansion Vijay Focuses on Bengaluru Elections
  • త్వరలో బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు
  • బెంగళూరులో నివసిస్తున్న లక్షలాది మంది తమిళులు
  • కర్ణాటకలో జెండా పాతాలనుకుంటున్న విజయ్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి అధికార పగ్గాలు చేపట్టిన నటుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఇప్పుడు పొరుగు రాష్ట్రాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తన పార్టీ టీవీకే విస్తరణలో భాగంగా ఆయన కర్ణాటక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా, త్వరలో జరగబోయే బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ (BBMP) ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా కర్ణాటకలో పార్టీ జెండా పాతాలని విజయ్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


ఐటీ హబ్ బెంగళూరు నగరంలో స్థానిక కన్నడిగులతో పాటు లక్షలాది మంది తమిళ ప్రజలు దశాబ్దాలుగా నివసిస్తున్నారు. అంతేకాకుండా, నటుడిగా విజయ్‌కు కర్ణాటక వ్యాప్తంగా, ముఖ్యంగా బెంగళూరులో భారీ సంఖ్యలో అభిమాన సంఘాలు, బలమైన ఫాలోయింగ్ ఉంది. ఇటీవల తమిళనాడు ఎన్నికల్లో టీవీకే సాధించిన చారిత్రాత్మక విజయాన్ని బెంగళూరులోని విజయ్ అభిమానులు పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకుని తమ మద్దతును చాటుకున్నారు. ఈ సానుకూలతలను ఓట్లుగా మార్చుకుని, అక్కడి స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని టీవీకే అధిష్ఠానం భావిస్తున్నట్లు ఇన్‌సైడ్ టాక్ నడుస్తోంది.


కర్ణాటక రాజకీయాల్లోకి టీవీకే ఎంట్రీ ఇస్తుందనే వార్తలు బెంగళూరు రాజకీయ వర్గాల్లో ఇప్పుడే ప్రకంపనలు సృష్టిస్తున్నప్పటికీ... దీనిపై విజయ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. పార్టీని ఇతర దక్షిణాది రాష్ట్రాలకు విస్తరించే వ్యూహంలో భాగంగానే ఈ ముందడుగు ఉండబోతోందని, త్వరలోనే బెంగళూరు ఎన్నికల పోటీపై టీవీకే స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.


Go Back to Shorts
Vijay
Joseph Vijay
TVK party
Tamil Nadu
Karnataka politics
Bengaluru municipal elections
BBMP elections
Tamil people in Bangalore
actor Vijay fans
South Indian politics

More Telugu News