సీఎస్‌కే కొత్త కోచ్‌గా ఎంఎస్ ధోనీ? అశ్విన్ సంచలన పోస్ట్!
- ఫ్లెమింగ్‌ను కోచ్ పదవి నుంచి మార్చాలని డిమాండ్
- వరుసగా 3 సీజన్లలో ప్లేఆఫ్స్ చేరని చెన్నై సూపర్ కింగ్స్
- పవర్ హిట్టింగ్ గేమ్ ఆడటంలో ఫ్లెమింగ్ వ్యూహాల వైఫల్యం
- అతడి స్థానంలో ధోనీని తీసుకోవచ్చని అశ్విన్ సూచన
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్టు హెడ్ కోచ్ పదవి నుంచి స్టీఫెన్ ఫ్లెమింగ్‌ను తొలగిస్తే కొత్త కోచ్ కోసం ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదని టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఆ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీయే ఆ పదవికి అర్హుడని అశ్విన్ ‘ఎక్స్’ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐదుసార్లు జట్టుకు ట్రోఫీలు అందించిన ధోనీ ప్రస్తుతం సీఎస్‌కే డగౌట్‌లోనే ఉన్నాడని అశ్విన్ గుర్తుచేశాడు.
ఫ్లెమింగ్‌పై ఎందుకు విమర్శలు?
స్టీఫెన్ ఫ్లెమింగ్ 2009 నుంచి సీఎస్‌కే కోచ్‌గా కొనసాగుతున్నాడు. అతడి హయాంలో జట్టు ఎన్నో విజయాలు సాధించింది. అయినా గత మూడు సీజన్లుగా చెన్నై కనీసం ప్లేఆఫ్స్‌కు కూడా అర్హత సాధించలేకపోయింది. ప్రస్తుత ఆధునిక టీ20 క్రికెట్‌లో మిగతా జట్లు భారీ హిట్టింగ్‌పై దృష్టి పెడుతుంటే చెన్నై మాత్రం ఇంకా పాత పద్ధతులనే నమ్ముకుంటోందనే విమర్శలు వస్తున్నాయి. రాహుల్ త్రిపాఠీ, దీపక్ హుడా, డారిల్ మిచెల్ వంటి ఆటగాళ్లు ఈ పాత శైలి వల్ల రాణించలేకపోయారు.
జట్టులో లోపాలు
ప్రస్తుత సీజన్‌లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఫామ్ కోల్పోవడం టాప్ ఆర్డర్ బ్యాటింగ్‌ను దెబ్బతీసింది. బౌలింగ్‌లో నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ రాణిస్తున్నప్పటికీ.. ఒక సమర్థమైన బౌలింగ్ యూనిట్‌గా చెన్నై రాణించలేకపోతోంది. గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తరహాలో చెన్నై బౌలింగ్‌లో ఆ పదును కనిపించడం లేదు. గాయం కారణంగా ధోనీ ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడంతో నాయకత్వ లోపం స్పష్టంగా తెలిసొచ్చింది.