అగనంపూడి వద్ద రోడ్డు ప్రమాదం... పెళ్లయిన మరుసటి రోజే నవవధువు దుర్మరణం

New Bride Dies in Aganampudi Road Accident After Wedding
  • బుధవారం రాత్రి నర్సింగరావు, రాజేశ్వరిల వివాహం
  • వాడచీపురుపల్లి నుంచి అగనంపూడికి వెళుతుండగా ప్రమాదం
  • వరుడితో పాటు కారులో ఉన్న ముగ్గురికి గాయాలు
విశాఖపట్నం గాజువాక అగనంపూడిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నవవధువు మృతి చెందింది. బుధవారం రాత్రి వివాహం జరిగింది. ఆ తర్వాత అత్తారింటికి బయలుదేరి వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వరుడికి గాయాలయ్యాయి. నిన్న రాత్రి నర్సింగరావు, రాజేశ్వరిల వివాహం వాడచీపురుపల్లిలో జరిగింది. వివాహం అనంతరం కొత్త జంట కారులో అగనంపూడికి బయలుదేరింది.

మార్గమధ్యంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పోల్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో పెళ్ళి కూతురు తీవ్రగాయాలతో ఘటనా స్థలంలోనే మృతి చెందింది. ఈ ప్రమాదంలో వరుడుకి కూడా గాయాలయ్యాయి.

కారులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పెళ్ళైన మరుసటిరోజే, కాళ్ళ పారాణి ఆరకముందే నవవధువు మృతి చెందడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
Advertisement
Rajeshwari
Visakhapatnam accident
Road accident
New bride death
Gajuwaka
Aganampudi

More Telugu News