పవన్ రెండో భుజానికి కూడా సమస్య ఉందని వైద్యులు చెప్పారు: ముంబైలో చంద్రబాబు
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- భుజానికి మూడున్నర గంటల పాటు ఆపరేషన్ జరిగిందని వెల్లడి
- పవన్‌కు మూడు వారాల పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు
- ప్రజల మధ్యలో ఉన్నప్పుడు ఒత్తిడి కారణంగానే పవన్‌కు గాయమైందని వెల్లడి
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఆదివారం ఆయన ముంబై వెళ్లి ఆసుపత్రిలో పవన్ కల్యాణ్‌ను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పవన్ ఆరోగ్య పరిస్థితిని, వైద్యుల సూచనలను వివరించారు.
అభిమానుల తాకిడి వల్లే సమస్య
పవన్ కల్యాణ్ ఎప్పుడూ ప్రజల సేవలోనే ఉంటారని, వారి మధ్యకు వెళ్లినప్పుడు తనను తాను మరిచిపోతారని చంద్రబాబు అన్నారు. "పవన్ ఎక్కడికి వెళ్లినా పెద్ద సంఖ్యలో జనం వస్తారు. ఆ సమయంలో తోపులాట, ఒత్తిడి సర్వసాధారణం. ఈ ఒత్తిడి కారణంగానే ఆయన భుజానికి సమస్య వచ్చింది. ఇది ఈరోజు వచ్చింది కాదు, చాలా కాలంగా ఈ నొప్పితో బాధపడుతున్నారు. చివరకు ఇక్కడికి వచ్చి అత్యుత్తమ వైద్యుల చేత ఆపరేషన్ చేయించుకున్నారు. దాదాపు మూడున్నర గంటల పాటు ఈ ఆపరేషన్ జరిగింది" అని చంద్రబాబు తెలిపారు. ప్రస్తుతం పవన్ వేగంగా కోలుకుంటున్నారని, త్వరలోనే పూర్తి ఆరోగ్యవంతులవుతారనే విశ్వాసం ఉందని చెప్పారు.
వైద్యుల సూచన మేరకు పవన్ కల్యాణ్‌కు మూడు వారాల పాటు పూర్తి విశ్రాంతి అవసరమని చంద్రబాబు పేర్కొన్నారు. ఆ తర్వాత ఫిజియోథెరపీ చేయించుకోవాల్సి ఉంటుందని వివరించారు. "పవన్ రెండో భుజానికి కూడా కొంచెం సమస్య ఉంది. దానికి ప్రస్తుతానికి ఫిజియోథెరపీ, వ్యాయామాలు చేయాలని వైద్యులు సూచించారు. ఆరు నెలల తర్వాత పరిస్థితిని సమీక్షించి, అవసరమైతే తదుపరి చర్యలు తీసుకుంటారు" అని చంద్రబాబు వెల్లడించారు.
జాతీయ అంశాలపై స్పందన
ఈ సందర్భంగా చంద్రబాబు పలు జాతీయ అంశాలపై కూడా మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు. "ప్రధాని మోదీ వల్ల ప్రపంచవ్యాప్తంగా భారతదేశ గౌరవం పెరిగింది. ఆయన కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా గౌరవించబడే శక్తివంతమైన నాయకుడు. నేడు ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంటే, భారతదేశం మాత్రం స్థిరంగా అధిక వృద్ధి రేటును సాధిస్తోంది. దీనికి కారణం మోదీ నాయకత్వమే. సరైన సమయంలో, సరైన ప్రదేశంలో, సరైన నాయకుడు ఉండటం వల్లే ఇది సాధ్యమవుతోంది. ఆయన నాయకత్వంలో 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందనే పూర్తి విశ్వాసం నాకుంది" అని చంద్రబాబు అన్నారు.
వియత్నాం పడవ ప్రమాదంపై మాట్లాడుతూ.. అది చాలా దురదృష్టకరమైన సంఘటన అని, పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని తెలిపారు. మృతదేహాలను వెనక్కి తీసుకువస్తున్నామని, అక్కడున్న వారిని సురక్షితంగా వెనక్కి పంపే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఇక ఉత్తరప్రదేశ్ లో అయోధ్య ఘటనపై మాట్లాడుతూ.. ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, విచారణ జరుగుతున్నందున కొంత సమయం వేచి చూడాలన్నారు.
పశ్చిమ బెంగాల్‌లో యూసీసీ కమిటీ ఏర్పాటును స్వాగతిస్తూ.. ఒకప్పుడు 'బెంగాల్ ఈరోజు ఆలోచించింది, దేశం రేపు ఆలోచిస్తుంది' అనే వారని, మధ్యలో ఆగిపోయిన ఆలోచన ఇప్పుడు మళ్లీ మొదలైందని, బెంగాల్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉందని వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీ గురించి అడిగిన ప్రశ్నకు, నాయకుల పనితీరును బట్టే ప్రజలు అంచనా వేస్తారని, సమస్యల్లో ఉన్న ప్రజలకు అండగా ఉన్నప్పుడే నాయకులకు విశ్వసనీయత లభిస్తుందని చంద్రబాబు పరోక్షంగా చురకలు అంటించారు. అనంతరం, పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వైద్యుల నివేదికను చంద్రబాబు మీడియాకు అందించారు.