'కొకైన్ క్వీన్'కు రాచమర్యాదలు.. ఒక్క వీడియోతో పరువు పోగొట్టుకున్న కరాచీ పోలీసులు
- 'కొకైన్ క్వీన్'గా పేరుపొందిన డ్రగ్స్ మాఫియా డాన్ అన్మోల్
- కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్‌లలో భారీ డ్రగ్స్ నెట్‌వర్క్
- సంకెళ్లు లేకుండా కోర్టుకు తీసుకెళ్తున్న వీడియో వైరల్
- ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో ఉన్నత స్థాయి విచారణకు ఆదేశం
- విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఎస్కార్ట్ పోలీసు అధికారుల సస్పెండ్
పాకిస్థాన్‌లోని కరాచీలో 'కొకైన్ క్వీన్'గా పేరుపొందిన డ్రగ్స్ మాఫియా డాన్ అన్మోల్ అలియాస్ పింకీ అరెస్ట్ ఒక సంచలనం అయితే, ఆమెకు పోలీసులు ఇచ్చినట్లు చెబుతున్న వీఐపీ ట్రీట్‌మెంట్ ఇప్పుడు అంతకుమించిన వివాదాన్ని రేపుతోంది. నిందితురాలిని కోర్టుకు హాజరుపరిచే సమయంలో పోలీసులు అనుసరించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కరాచీ పోలీస్ శాఖ ఇరకాటంలో పడింది.
కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్‌లలో భారీ డ్రగ్స్ నెట్‌వర్క్‌ను నడుపుతున్న అన్మోల్‌ను కొన్ని రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె నుంచి కోట్ల రూపాయల విలువైన కొకైన్‌తో పాటు, డ్రగ్స్ తయారీకి ఉపయోగించే రసాయనాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ భారీ విజయం సాధించిన కొన్ని రోజులకే పోలీసుల కీర్తి ప్రతిష్ఠలు మసకబారాయి.
అన్మోల్‌ను కోర్టుకు హాజరుపరిచినప్పుడు తీసిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఆ వీడియోలో, నీలిరంగు టీ-షర్ట్, వయొలెట్ పలాజో ప్యాంట్ ధరించిన అన్మోల్ చేతులకు సంకెళ్లు లేకపోవడం స్పష్టంగా కనిపించింది. అంతేకాకుండా, ఒక పోలీస్ అధికారి ఆమెకు అత్యంత గౌరవంగా దారి చూపిస్తూ, జాగ్రత్తగా నడిపించుకుంటూ తీసుకురావడం తీవ్ర దుమారానికి కారణమైంది. ఒక ప్రమాదకరమైన నిందితురాలి పట్ల పోలీసులు ఇంత మర్యాదగా ప్రవర్తించడం ఏమిటని ప్రజలు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో, పోలీస్ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించారు. కరాచీ పోలీస్ చీఫ్ జావేద్ ఆలం ఓధో ఈ వ్యవహారంపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. నిందితురాలికి ఎస్కార్ట్‌గా వెళ్లిన పోలీసు అధికారులను విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఉన్నతస్థాయి నిందితుల విషయంలో అనుసరించాల్సిన నిర్దిష్ట ప్రొటోకాల్‌ను ఎందుకు ఉల్లంఘించారనే దానిపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు.
మహిళా కొరియర్లను, మొబైల్ ప్రొడక్షన్ యూనిట్లను వాడుతూ చాలాకాలంగా పోలీసుల కళ్లుగప్పి అన్మోల్ తన సామ్రాజ్యాన్ని విస్తరించినట్లు దర్యాప్తులో తేలింది. అయితే, పోలీసులు సాధించిన ఈ ఘనత కాస్తా, కోర్టు వద్ద చోటుచేసుకున్న ఈ వివాదంతో పూర్తిగా పక్కకు వెళ్లిపోయింది.