దేశంలో ఇంధన కొరత లేదు.. కానీ రోజుకు రూ. 1000 కోట్ల నష్టం
- దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల కొరత లేదన్న కేంద్రం
- ధరల పెంపునకు రంగం సిద్ధం చేస్తున్నారంటూ విపక్షాల విమర్శ
- ప్రధాని పిలుపుతో భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు, రూపాయి
పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పొదుపు పాటించాలంటూ ప్రజలకు పిలుపునిచ్చిన మరుసటి రోజే కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దేశంలో పెట్రోలియం ఉత్పత్తులకు ఎలాంటి కొరతా లేదని స్పష్టం చేసింది. అయితే, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగినా, ఆ భారాన్ని ప్రజలపై మోపకుండా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు రోజుకు దాదాపు రూ.1,000 కోట్ల నష్టాలను భరిస్తున్నాయని వెల్లడించింది.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన సోమవారం జరిగిన మంత్రుల కమిటీ సమావేశంలో ఈ విషయాలు వెల్లడించారు. దేశంలో 60 రోజులకు సరిపడా ముడిచమురు, 45 రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది. 703 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు కూడా ఆశాజనకంగా ఉన్నాయని పేర్కొంది. అయితే, అంతర్జాతీయ ధరల వల్ల దేశంపై భారీ భారం పడుతోందని, ఇంధన పొదుపు ద్వారా ఈ భారాన్ని తగ్గించవచ్చని ప్రభుత్వం పేర్కొంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల వాడకాన్ని తగ్గించాలని, అనవసరమైన విదేశీ మారక వ్యయాన్ని నివారించాలని ప్రధాని మోదీ తన విజ్ఞప్తిని పునరుద్ఘాటించారు.
ప్రధాని పిలుపుపై విపక్షాలు తీవ్రంగా స్పందించాయి. ఇది మోదీ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఇంధన ధరల పెంపునకు రంగం సిద్ధం చేస్తున్నారని జైరాం రమేశ్ ఆరోపించారు. ఎన్నికల తర్వాతే ఈ సంక్షోభం ఎందుకు గుర్తుకొచ్చిందని అఖిలేశ్ యాదవ్ ప్రశ్నించగా, మంగళసూత్రాల గురించి మాట్లాడిన మోదీయే ఇప్పుడు బంగారం కొనవద్దని చెప్పడం విడ్డూరంగా ఉందని తేజస్వి యాదవ్ ఎద్దేవా చేశారు.
ప్రధాని పిలుపు ప్రభావంతో సోమవారం స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. రూపాయి విలువ ఆల్-టైమ్ కనిష్టానికి చేరింది. ఈ విమర్శలపై స్పందించిన బీజేపీ, ఇది దేశ ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయమని, గతంలో నెహ్రూ కూడా ఇలాంటి పిలుపు ఇచ్చారని గుర్తు చేసింది.