విభిన్న కథతో శ్రీవిష్ణు.. ‘కామ్రేడ్ కళ్యాణ్’ విడుదల తేదీ ఫిక్స్
- అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా ‘కామ్రేడ్ కళ్యాణ్’ విడుదల
- విడుదల తేదీని ప్రకటిస్తూ పోస్టర్ షేర్ చేసిన శ్రీవిష్ణు
- 1992 ఆంధ్ర-ఒడిశా సరిహద్దు నేపథ్యంలో యాక్షన్ ఎంటర్‌టైనర్
- ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచిన ‘ఒరియా పిల్ల’ పాట
- రాధికా శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో కీలక పాత్రలు
విలక్షణ కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'కామ్రేడ్ కళ్యాణ్'. మహిమా నంబియార్ కథానాయికగా నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ విడుదల తేదీని చిత్రబృందం శనివారం అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 9న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు తెలిపింది.
ఈ విషయాన్ని శ్రీవిష్ణు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకున్నారు. "కామ్రేడ్స్! అక్టోబర్ 9న థియేటర్లలో మన 'కామ్రేడ్ కల్యాణ్'తో 'లాల్ సలాం' చెబుదాం" అంటూ విడుదల తేదీ పోస్టర్‌ను షేర్ చేశారు. జనక్‌రామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ రచయిత కోన వెంకట్ సమర్పిస్తున్నారు. స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్ఎల్‌పి పతాకంపై వెంకట కృష్ణ కర్నాటి, సీత కర్నాటి నిర్మిస్తున్నారు.
1992 నాటి ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతం నేపథ్యంలో 'కామ్రేడ్ కళ్యాణ్' సినిమా కథ సాగనుంది. శ్రీవిష్ణు, మహిమా నంబియార్‌తో పాటు సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్, మలయాళ నటుడు షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇప్పటికే 'కామ్రేడ్ కళ్యాణ్' సినిమా నుంచి జూన్‌లో విడుదలైన 'ఒరియా పిల్ల' పాట చార్ట్‌బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. విజయ్ బుల్గానిన్ స్వరపరిచిన ఈ గీతాన్ని సిద్ శ్రీరామ్ ఆలపించగా, భాస్కరభట్ల సాహిత్యం అందించారు. ఈ చిత్రానికి సాయిశ్రీరామ్ సినిమాటోగ్రఫీ, చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.