నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీకి వర్ష సూచన
- నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
- మంగళవారం పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్ష సూచన
- అల్లూరి, పోలవరం జిల్లాల్లోని కొన్ని మండలాల్లో వడగాలులు
- కొన్ని ప్రాంతాల్లో వర్షాలు, మరికొన్నిచోట్ల ఎండ ప్రభావం
- వాతావరణ వివరాలు వెల్లడించిన ఏపీ విపత్తుల సంస్థ
నైరుతి బంగాళాఖాతంలో, ఉత్తర శ్రీలంక తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం అదే ప్రాంతంలో కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
ఈ అల్పపీడన ప్రభావంతో మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడొచ్చని తెలిపారు.
ఒకవైపు వర్ష సూచన ఉన్నప్పటికీ, మరోవైపు వడగాలుల ప్రభావం కూడా ఉంటుందని ప్రఖర్ జైన్ హెచ్చరించారు. ముఖ్యంగా అల్లూరి జిల్లాలోని జికే వీధి, ముంచింగిపుట్టు, పెదబయలు మండలాలతో పాటు, పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలోని చింతూరు, కూనవరం, మారేడుమిల్లి, వీఆర్ పురం, గుర్తేడు వంటి మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఇవి కాకుండా, మరికొన్ని జిల్లాల్లో ఎండ ప్రభావం యథాతథంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని ఐఎండీ చెబుతోంది.