తెలంగాణ సచివాలయంలో నకిలీ పోలీస్ హల్‌చల్.. సీఎంను కల్పిస్తానంటూ వీడియోలు!
- సచివాలయంలో నకిలీ పోలీస్ దుస్తులతో ఓ వ్యక్తి హల్‌చల్
- సీఎం రేవంత్ రెడ్డిని కల్పిస్తానంటూ సోషల్ మీడియాలో వీడియోలు
- వీడియోలు వైరల్ కావడంతో నిందితుడి కోసం పోలీసుల గాలింపు
- నిందితుడిపై ఏపీలోనూ పలు చీటింగ్ కేసులు ఉన్నట్లు గుర్తింపు
విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిఖిల్ అసలు పోలీసే కాదని, సోషల్ మీడియా రీల్స్ కోసం పాతబస్తీలో పోలీస్ యూనిఫాం కొనుగోలు చేసి ఈ మోసానికి పాల్పడ్డాడని విచారణలో తేలింది. ఈ వీడియోలు వైరల్ కావడంతో పోలీసులు అప్రమత్తమై నిఖిల్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడిపై ఆంధ్రప్రదేశ్‌లోని పలు పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే చీటింగ్ కేసులు నమోదైనట్లు సమాచారం.
ఈ ఘటనతో సచివాలయ భద్రతా వ్యవస్థ, నిఘా వర్గాల పనితీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అత్యంత పటిష్ఠమైన భద్రత ఉండాల్సిన ప్రదేశంలో నకిలీ వ్యక్తి వీడియోలు తీసేంత వరకు గుర్తించకపోవడంపై పలువురు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలా నకిలీ గుర్తింపు కార్డులతో డజనుకు పైగా వ్యక్తులు సచివాలయంలోకి ప్రవేశించినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ తాజా ఘటన ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతం పోలీసులు నిఖిల్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.