శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలలో విటమిన్ ఇ ఒకటి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా, చర్మ సౌందర్యాన్ని కాపాడటంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కండరాల బలానికి కూడా ఇది ఎంతగానో దోహదపడుతుంది.

విటమిన్ ఇ ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. శరీరంలో ఫ్రీ రాడికల్స్ వల్ల కణాలకు జరిగే నష్టాన్ని నివారించి, వృద్ధాప్య ఛాయలను ఆలస్యం చేస్తుంది. అందుకే ఆరోగ్య నిపుణులు విటమిన్ ఇ అధికంగా ఉండే ఆహారాలను రోజూ తీసుకోవాలని సూచిస్తున్నారు.

మనకు రోజూ లభించే పలు ఆహార పదార్థాలలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా బాదం, పొద్దుతిరుగుడు గింజలు, పల్లీల నుంచి తీసిన పీనట్ బటర్‌లో ఇది అధిక మోతాదులో లభిస్తుంది. ఇవి చర్మాన్ని మెరిసేలా చేసి గుండెను బలంగా ఉంచుతాయి. అలాగే, ఆకుకూరల్లో ఒకటైన పాలకూర, బ్రోకోలీ కూడా విటమిన్ ఇకి మంచి మూలాలు. ఇవి కంటి చూపును మెరుగుపరుస్తాయి.

పండ్ల విషయానికొస్తే కివీ, అవకాడోలలో విటమిన్ ఇ లభిస్తుంది. వంట నూనెలైన సన్‌ఫ్లవర్ ఆయిల్, ఆలివ్ నూనెలో కూడా ఈ విటమిన్ సమృద్ధిగా ఉండి శరీర కణాలను రక్షిస్తుంది. ఈ ఆహారాలను మన రోజువారీ డైట్‌లో చేర్చుకోవడం ద్వారా విటమిన్ ఇ లోపాన్ని అధిగమించి, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు.