800 ఫోర్ల కోహ్లీ.. 2000 పరుగుల సుదర్శన్.. ఐపీఎల్లో రికార్డుల మోత!
- గుజరాత్ టైటాన్స్‌కు సాయి సుదర్శన్ అద్భుత సెంచరీ
- ఐపీఎల్లో అత్యంత వేగంగా 2000 పరుగులు చేసిన ఆటగాడిగా సుదర్శన్ రికార్డు
- ఐపీఎల్ చరిత్రలో 800 ఫోర్లు కొట్టిన తొలి క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ ఘనత
- ఒకే ఫ్రాంచైజీ తరఫున 300 సిక్సర్లు బాదిన తొలి ప్లేయర్‌గా కోహ్లీ మరో రికార్డు
ఐపీఎల్ 2026లో భాగంగా శుక్రవారం గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ రికార్డులకు వేదికైంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ యువ బ్యాటర్ సాయి సుదర్శన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగగా, ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన మైలురాళ్లను అందుకున్నాడు.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ పోరులో సాయి సుదర్శన్ కేవలం 58 బంతుల్లో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో పది ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్‌తో సుదర్శన్ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. కేవలం 47 ఇన్నింగ్స్‌లలోనే 2000 ఐపీఎల్ పరుగులు పూర్తి చేసి, ఈ ఫీట్ సాధించిన అత్యంత వేగవంతమైన ఆటగాడిగా క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టాడు.
మ్యాచ్ అనంతరం సుదర్శన్ మాట్లాడుతూ.. "నాపై నాకు చాలా ఎక్కువ అంచనాలు ఉంటాయి. గత కొన్ని మ్యాచ్‌ల్లో మంచి ఆరంభాలు లభించినా, ఇన్నింగ్స్‌ను సరిగ్గా ముగించలేకపోయాను. అందుకే ఈ సెంచరీ నాకు చాలా ప్రత్యేకం. పిచ్ కాస్త నెమ్మదిగా ఉన్నా, ఇది బౌలర్లకు మంచి స్కోరని భావిస్తున్నాను" అని తెలిపాడు.
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
ఇదే మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో 800 ఫోర్లు కొట్టిన మొట్టమొదటి క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. కగిసో రబాడా బౌలింగ్‌లో బౌండరీ బాది ఈ ఘనతను అందుకున్నాడు. ఈ జాబితాలో శిఖర్ ధావన్ (768), డేవిడ్ వార్నర్ (663), రోహిత్ శర్మ (653) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అంతేకాకుండా ఒకే ఫ్రాంచైజీ (ఆర్సీబీ) తరఫున 300 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా కూడా కోహ్లీ మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. మొత్తం మీద ఒకే మ్యాచ్‌లో ఇరు జట్ల స్టార్ ఆటగాళ్లు రికార్డులు సృష్టించడం అభిమానులను ఆకట్టుకుంది.