నితిన్ కొత్త సినిమా ఫిక్స్.. సితార బ్యానర్‌లో 'మిరాయ్' బ్యూటీతో జోడీ!

Nithiin to Star in Sithara Entertainments Family Drama with Rithika Nayak
  • ఫ్యామిలీ డ్రామా మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నితిన్
  • సినిమాను నిర్మించనున్న సితార ఎంటర్టైన్మెంట్స్
  • హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన రితికా నాయక్

వరుస పరాజయాలతో సతమతమవుతున్న యంగ్ హీరో నితిన్, ఈసారి పక్కా కమర్షియల్ హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. చాలా కథలను తిరస్కరించిన తర్వాత, నితిన్ ఒక కొత్త దర్శకుడి ఫ్యామిలీ డ్రామాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మించనుంది. ఈ నెలాఖరులో ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం కానుంది.


'అశోకవనంలో అర్జున కల్యాణం', 'మిరాయ్' చిత్రాలతో ఆకట్టుకున్న రితికా నాయక్ ను ఈ సినిమాలో కథానాయికగా ఎంపిక చేసినట్టు సమాచారం. వరుణ్ తేజ్ సినిమాలతో బిజీగా ఉన్న ఆమెకు నితిన్ సినిమా మరో క్రేజీ ఆఫర్ అని చెప్పొచ్చు. ఇది ఒక స్వచ్ఛమైన ఫ్యామిలీ డ్రామా అని సమాచారం. నితిన్ గతంలో 'అ ఆ' వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్లతో భారీ విజయాలు అందుకున్న నేపథ్యంలో, ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

Advertisement
Nithiin
Nithiin movie
Sithara Entertainments
Rithika Nayak
Mirai
Telugu cinema
Family drama
Ashoka Vanamlo Arjuna Kalyanam
New movie

More Telugu News