గర్జనకు సిద్ధమైన ‘గాయపడ్డ సింహం’.. ట్రైలర్ ఎప్పుడంటే..!

Tarun Bhasckers Gayapadina Simham Trailer Release Tomorrow
  • తరుణ్ భాస్కర్ హీరోగా ‘గాయపడ్డ సింహం’ చిత్రం
  • రేపు సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్న మేకర్స్
  • మే 1న థియేటర్లలో సినిమా గ్రాండ్ రిలీజ్
  • హీరోయిన్‌గా నటిస్తున్న ఫరియా అబ్దుల్లా
  • అమెరికన్ డ్రీమ్ నేపథ్యంలో సెటైరికల్ ఎంటర్‌టైనర్‌గా రూపకల్పన
దర్శకుడిగా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్, ఇప్పుడు హీరోగా ‘గాయపడ్డ సింహం’ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రేజీ ఎంటర్‌టైనర్‌కు సంబంధించి చిత్రబృందం ఒక కీలక అప్‌డేట్ ఇచ్చింది. సినిమా ట్రైలర్‌ను రేపు (ఏప్రిల్ 25న) విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మే 1న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.

కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ సరసన ‘జాతిరత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. అమెరికన్ డ్రీమ్ అనే ఆసక్తికరమైన కథాంశంతో సెటైరికల్ కామెడీ, ఎమోషన్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన్నట్లు మేకర్స్ తెలిపారు. ఇప్పటికే విడుదలైన మూవీ ‘ట్రైజర్’లో తన సొంత సినిమా ‘పెళ్లి చూపులు’పై తరుణ్ భాస్కర్ వేసిన పంచులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఈ సినిమాకు స్వీకర్ అగస్తీ సంగీతం సమకూర్చగా, దర్శకుడు పవన్ సాదినేని సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ట్రైలర్ విడుదలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందని, మే 1న థియేటర్లలో ఈ ‘గాయపడ్డ సింహం’ ఎలాంటి గర్జన వినిపిస్తుందో చూడాలని సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
Go Back to Shorts
Gayapadina Simham
Tarun Bhascker
Faria Abdullah
Kashyap Srinivas
Pelli Choopulu
Telugu Movie Trailer
American Dream
Swekar Agasti
Pawan Sadineni

More Telugu News