గుజరాత్ పోర్టుకు వస్తున్న నౌకను సీజ్ చేసిన ఇరాన్

Gujarat bound ship among two vessels seized by Iran
  • రెండు కంటైనర్లను సీజ్ చేసిన ఐఆర్జీసీ
  • పనామా జెండా, లైబీరియా జెండా కలిగిన నౌకల సీజ్
  • నౌకలు తమ ఆధీనంలో ఉన్నట్లు ప్రకటించిన ఇరాన్ మీడియా
హర్మూజ్ జలసంధి వద్ద కీలక పరిణామం చోటు చేసుకుంది. గుజరాత్ పోర్టుకు వస్తున్న నౌక సహా రెండు కంటైనర్లను ఇరాన్ సీజ్ చేసింది. కాల్పుల విరమణ గడువును పొడిగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటిస్తూనే, పోర్టుల దిగ్బంధనం మాత్రం కొనసాగుతుందని తెలిపారు. దీనితో ఇరాన్ ధీటుగా స్పందిస్తోంది. ఈ క్రమంలో రెండు నౌకలపై ఇరాన్ ఉదయం కాల్పులు జరిపింది.

అలాగే రెండు నౌకలు తమ స్వాధీనంలో ఉన్నట్లు ఐఆర్జీసీ తెలిపింది. ఇందులో ఒక నౌక గుజరాత్ తీరానికి వస్తున్న క్రమంలో చోటు చేసుకుంది. పనామా జెండా కలిగిన ఎంఎస్సీ ఫ్రాన్సిస్కా, లైబీరియా జెండా కలిగిన ఎపామినోండాస్ కార్గో నౌకలు తమ ఆధీనంలో ఉన్నట్లు ఇరాన్ మీడియా ప్రకటించింది. గ్రీస్‌కు చెందిన యూఫోరియా అనే మరో నౌకను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రకటించింది.
Go Back to Shorts
Gujarat bound ship
Strait of Hormuz

More Telugu News