Advertisement

మావోయిస్టుల్లా బీఆర్ఎస్ కూడా కనుమరుగవుతుంది: రఘునందన్ రావు

Raghunandan Rao fires at BRS and Congress
  • జగిత్యాల నుంచి జైత్రయాత్ర ప్రారంభమన్న బీఆర్ఎస్‌కు బీజేపీ ఎంపీ కౌంటర్
  • కేసీఆర్ హయాంలో అవినీతి జరిగిందని కవిత చెప్పారన్న రఘునందన్ రావు
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ బంధం వీణావాణీల వంటిదని చురక
గతంలో జగిత్యాల నుంచి జైత్రయాత్ర చేసిన నక్సలైట్లు ఆపై మావోయిస్టులుగా మారి కనుమరగయ్యారని, అలాగే బీఆర్ఎస్ కూడా కనుమరుగవుతుందని తెలంగాణ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. జలదృశ్యంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్‌గా మారిన ఆ పార్టీ అదృశ్యం కావడం ఖాయమని అన్నారు. జగిత్యాల నుంచే తమ జైత్రయాత్ర ప్రారంభం కాబోతుందన్న బీఆర్ఎస్ అధినేత వ్యాఖ్యలకు రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు.

కేసీఆర్ హయాంలో అవినీతి జరిగిందని స్వయంగా ఆయన కూతురు కవిత చెప్పారని ఆయన గుర్తు చేశారు. కవితను అప్రూవర్‌గా మార్చి నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు తిట్లను మానుకుని ప్రజల కోసం పనిచేయాలని సూచించారు. నిన్న జరిగిన బహిరంగ సభలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ఇద్దరూ తుపాకీ రాముడి మాటలే మాట్లాడారని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ బంధం వీణావాణిల వంటిదని అన్నారు. వారు పైకి వేరుగా కనిపిస్తున్నప్పటికీ, రెండు పార్టీలు ఒకటేనని విమర్శించారు. అందుకే కేసీఆర్, రేవంత్ రెడ్డిలు ఒకరినొకరు కాపాడుకుంటున్నారని మండిపడ్డారు. గతంలో ప్రధాని మోదీ తెలంగాణకు వస్తే బీఆర్ఎస్ వాళ్లు ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చి ఆయన వార్తలు రాకుండా కుట్ర చేశారని ఆరోపించారు. ఇప్పుడు అదే రీతిలో పేపర్లో చెరి సగం వార్తలు రావాలని ఇద్దరూ డ్రామాలు ఆడారని విమర్శించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు అంశాన్ని సీబీఐకి అప్పగించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు. కేసీఆర్, రేవంత్ రెడ్డిని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన కంపెనీ మేనేజ్ చేస్తోందని ఆరోపించారు. ఈ కంపెనీకే మూసీ పనులను కూడా అప్పగిస్తున్నారని అన్నారు. కేసీఆర్ చేసిన లక్ష కోట్ల అవినీతిని కక్కిస్తామని రాహుల్ గాంధీ చేత చెప్పించిన రేవంత్ రెడ్డి ఆ దిశగా ఏమీచేయడంలేదని అన్నారు.
Advertisement
Raghunandan Rao fires at BRS
Raghunandan Rao on KCR and Revanth Reddy

More Telugu News