ఐపీఎల్ 2026: తిలక్ వర్మ మెరుపు శతకం.. 18 ఏళ్ల రికార్డు సమం
- 45 బంతుల్లోనే సెంచరీ బాదిన తిలక్ వర్మ
- 2008లో సీఎస్కేపై సనత్ జయసూర్య నెలకొల్పిన రికార్డు సమం
- ఆ తర్వాతి స్థానంలో కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్
ముంబై ఇండియన్స్ యువ సంచలనం తిలక్ వర్మ ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. కేవలం 45 బంతుల్లోనే సెంచరీ బాది, ముంబై ఇండియన్స్ తరఫున అత్యంత వేగవంతమైన శతకం సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. గుజరాత్ టైటాన్స్‌తో సోమవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఈ అద్భుతమైన ఫీట్ సాధించాడు.
ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో 2008లో చెన్నై సూపర్ కింగ్స్‌పై సనత్ జయసూర్య నెలకొల్పిన 45 బంతుల సెంచరీ రికార్డును తిలక్ సమం చేశాడు. 18 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న ఈ రికార్డును అందుకోవడం విశేషం. ముంబై తరఫున వేగవంతమైన సెంచరీల జాబితాలో జయసూర్య, తిలక్ (45 బంతులు) అగ్రస్థానంలో ఉండగా.. కామెరూన్ గ్రీన్ (47 బంతులు), సూర్యకుమార్ యాదవ్ (49 బంతులు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే, తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ ఆరంభంలో తడబడింది. కగిసో రబడా ధాటికి పవర్‌ప్లేలో 46 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్లిష్ట సమయంలో క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ, నమన్ ధీర్ (32 బంతుల్లో 45)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యం జోడించారు.
మొదట నెమ్మదిగా ఆడిన తిలక్ 33 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత అసలైన విధ్వంసం చూపించాడు. డెత్ ఓవర్లలో గుజరాత్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించి, బౌండరీలు, సిక్సర్లతో హోరెత్తించాడు. చివరి వరకు అజేయంగా నిలిచిన తిలక్, 8 ఫోర్లు, 7 సిక్సర్ల సహాయంతో 101 పరుగులు చేశాడు. అతడి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోరు సాధించింది. గుజరాత్ బౌలర్లలో రబాడా 3 వికెట్లు తీశాడు.