మూడు పూటలా అన్నమే... అయినా కండలు తిరిగిన దేహం.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వర్కర్ స్టోరీ!
- కండలు తిరిగిన దేహంతో ఆకట్టుకుంటున్న చెన్నై భవన నిర్మాణ కార్మికుడు
- వ్యాయామం, ఆహార నియమాలతోనే సాధ్యమన్న వర్కర్
- రోజుకు మూడు పూటలా అన్నం, కూరగాయలతో కూడిన సాధారణ భోజనం
- ప్రొటీన్ పౌడర్లు, స్టిరాయిడ్స్ వంటివి ఎప్పుడూ తీసుకోలేదని వెల్లడి
- వారానికి ఐదు రోజులు క్రమం తప్పని వ్యాయామం, 7 గంటల నిద్ర
ఫిట్‌గా, కండలు తిరిగిన దేహంతో ఉండాలంటే ఖరీదైన జిమ్‌లకు వెళ్లాలి, ప్రొటీన్ షేక్‌లు తాగాలి, కఠినమైన డైట్ పాటించాలని చాలామంది అనుకుంటారు. కానీ, చెన్నైకి చెందిన ఓ భవన నిర్మాణ కార్మికుడు ఈ అపోహలన్నింటినీ పటాపంచలు చేస్తున్నాడు. రోజంతా ఎండలో కష్టపడి పనిచేసే ఈ కార్మికుడి శరీరాకృతి, కండలు చూసి ప్రముఖ కంటెంట్ క్రియేటర్ జయచంద్రన్ తమిళరసన్ ఆశ్చర్యపోయారు. వెంటనే అతడిని ఇంటర్వ్యూ చేసి అతని ఫిట్‌నెస్ రహస్యాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వారానికి ఐదు రోజుల వర్కౌట్
రోజంతా శారీరక శ్రమ చేసినప్పటికీ, ఈ కార్మికుడు వారానికి ఐదు రోజులు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తాడు. తన వర్కౌట్ ప్లాన్‌ను వివరిస్తూ.. "సోమవారం చెస్ట్, మంగళవారం షోల్డర్, బుధవారం బ్యాక్, గురువారం బైసెప్స్-ట్రైసెప్స్, శుక్రవారం లెగ్స్ వర్కౌట్ చేస్తాను" అని చెప్పాడు. అయితే, మరుసటి రోజు పనికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు లెగ్ వర్కౌట్‌ను మరీ తీవ్రంగా చేయనని అతను పేర్కొన్నాడు. క్రమశిక్షణే తన ఫిట్‌నెస్‌కు మూలమని అతను నొక్కి చెప్పాడు.
మూడు పూటలా అన్నమే.. ఇడ్లీ, దోశ తినడు
ఆశ్చర్యకరంగా కండలు పెంచడానికి చాలామంది దూరంగా ఉండే కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాన్నే ఇతను తీసుకుంటాడు. రోజంతా పనిచేయడానికి కావాల్సిన శక్తి కోసం రోజుకు మూడు పూటలా అన్నం తింటానని చెప్పాడు. తన ఆహార ప్రణాళిక గురించి వివరిస్తూ.. "మూడు పూటలా అన్నం మాత్రమే తింటాను. సాంబార్, రసం, బీట్‌రూట్, క్యారెట్ వంటి కూరగాయలతో చేసిన కూరలు తింటాను. ఇడ్లీ, దోశ వంటివి తినను" అని వెల్లడించాడు. వారానికి ఒకసారి మాత్రమే మటన్ తింటానని, చికెన్ లేదా చేపలు ముట్టనని చెప్పడం విశేషం.
స్టిరాయిడ్స్, సప్లిమెంట్లు వాడలేదు
తాను ఎలాంటి స్టిరాయిడ్స్ గానీ, వే ప్రొటీన్ వంటి కమర్షియల్ సప్లిమెంట్స్ గానీ ఎప్పుడూ తీసుకోలేదని ఈ కార్మికుడు స్పష్టం చేశాడు. "పనిచేస్తాను, తింటాను, జిమ్‌కు వెళతాను... అంతే!" అని సింపుల్‌గా చెప్పాడు. ప్రతిరోజూ కనీసం 7 గంటలు నిద్రపోతానని, ఇంట్లో వండిన ఆహారాన్నే తింటానని తెలిపాడు. జంక్ ఫుడ్, మద్యం, ధూమపానం వంటి వాటికి దూరంగా ఉండాలని అతను సలహా ఇచ్చాడు. వంద శాతం నిబద్ధతతో ఉంటే ఏదైనా సాధించవచ్చని ఈ కార్మికుడి జీవనశైలి నిరూపిస్తోంది.