కన్నడ ఇండస్ట్రీ నుంచి మరో ఎపిక్ మూవీ... పోస్టర్ చూస్తేనే బీభత్సం!
- హోంబలే ఫిల్మ్స్ నుంచి మరో భారీ యానిమేటెడ్ చిత్రం ప్రకటన
- 'మహావతార్ పరశురామ్' టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
- మహావతార్ సినిమాటిక్ యూనివర్స్‌లో ఇది రెండో సినిమా
- 2027 డిసెంబర్‌లో థియేటర్లలో విడుదల కానున్న చిత్రం
'కేజీఎఫ్', 'సలార్' వంటి భారీ చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన హోంబలే ఫిల్మ్స్, తమ తదుపరి యానిమేటెడ్ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించింది. పరశురామ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 19న 'మహావతార్ పరశురామ్' అనే టైటిల్‌తో బీభత్సంగా ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ యానిమేటెడ్ చిత్రాన్ని 2027 డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించింది.
ఈ సినిమా, శ్రీమహావిష్ణువు దశావతారాల ఆధారంగా రూపొందుతున్న "మహావతార్ సినిమాటిక్ యూనివర్స్"లో రెండవది. గతేడాది విడుదలైన 'మహావతార్ నరసింహ' ఈ సిరీస్‌లో తొలి చిత్రం. ఆ సినిమా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారీ విజయం అందుకుంది. ఇప్పుడు అదే కోవలో విష్ణుమూర్తి ఆరవ అవతారమైన పరశురాముడి గాథతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అధర్మాన్ని అంతం చేసే శక్తిగా పరశురాముడు ఎలా ఆవిర్భవించాడనే ఇతివృత్తంతో సినిమా సాగుతుంది.
ఈ చిత్రానికి అశ్విన్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, హోంబలే ఫిల్మ్స్ అధినేత విజయ్ కిరగందూర్, క్లీమ్ ప్రొడక్షన్‌కు చెందిన శిల్పా ధావన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సామ్ సి.ఎస్. సంగీతాన్ని అందిస్తున్నారు. "మన కథలే మన బలం. నేటి తరానికి నచ్చే ఫార్మాట్‌లో మన మూలాల శక్తిని ప్రేక్షకులకు తిరిగి పరిచయం చేయడమే మా లక్ష్యం" అని నిర్మాత విజయ్ కిరగందూర్ తెలిపారు. విడుదలైన పోస్టర్‌పై "సహనం ముగిసిన చోట, పరశురాముడి గొడ్డలి మొదలవుతుంది!" అనే ట్యాగ్‌లైన్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమాటిక్ యూనివర్స్‌లో మొత్తం ఏడు చిత్రాలను ప్లాన్ చేస్తున్నట్లు నిర్మాతలు గతంలోనే ప్రకటించారు.