బాలయ్యతో ఒకే హెలికాప్టర్‌లో డింపుల్ హయతి

Nandamuri Balakrishna and Dimple Hayathi in same helicopter
  • గుంటూరులో సందడి చేసిన బాలయ్య, డింపుల్ హయతి
  • హైదరాబాద్ నుండి గుంటూరుకు హెలికాప్టర్‌లో వచ్చిన బాలయ్య, డింపుల్
  • బాలయ్యతో సెల్ఫీ దిగిన డింపుల్

నందమూరి బాలకృష్ణ తనదైన శైలిలో గుంటూరులో సందడి చేశారు. నిన్న లక్ష్మీపురంలో ఒక ప్రముఖ జ్యువెలరీ షోరూమ్ ప్రారంభోత్సవానికి యువ నటి డింపుల్ హయాతితో కలిసి ఆయన విచ్చేశారు. వీరిద్దరూ హైదరాబాద్ నుంచి గుంటూరుకు ప్రత్యేక హెలికాప్టర్‌లో ప్రయాణించారు. ఈ క్రమంలో డింపుల్ సెల్ఫీ వీడియో తీస్తుండగా, బాలయ్య ఎంతో సరదాగా క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ అల్లరి చేశారు. 


ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ఒకే ఈవెంట్‌లో కనిపించడంతో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న ‘NBK 111’ చిత్రంలో డింపుల్ నటిస్తోందన్న వార్తలకు మరింత బలం చేకూరింది. ఇందులో ఆమె రెండో హీరోయిన్‌గా నటిస్తోందని ఇప్పటికే సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

Go Back to Shorts
Nandamuri Balakrishna
Balakrishna
Dimple Hayathi
NBK 111
Guntur
Jewellery showroom launch
Tollywood
Lakshmipuram
Gopichand Malineni

More Telugu News