అదే జరిగితే కేసీఆర్ ముందుండి ఉద్యమాన్ని నడిపిస్తారు: బీజేపీకి కేటీఆర్ హెచ్చరిక
- మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతిస్తామన్న కేటీఆర్
- డీలిమిటేషన్ బిల్లు పేరుతో దక్షిణాదికి అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక
- బీజేపీ తెలంగాణకు ఎప్పుడూ మంచి చేయదని విమర్శ
బీజేపీ పార్టీ తెలంగాణకు ఎప్పుడూ మంచి చేయదని విమర్శించారు. అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంటు సీట్లను 50 శాతం పెంచుతామని కిషన్ రెడ్డి చెబుతున్నారని, కానీ డీలిమిటేషన్ బిల్లులో ఆ అంశమే లేదని అన్నారు. కిషన్ రెడ్డి చెప్పిన ప్రకారం అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179కి, 17 లోక్ సభ స్థానాలకు 26 పెరుగుతాయని చెప్పారని తెలిపారు. కానీ బిల్లులో ఈ పెరుగుదల లేదని అన్నారు.
బీజేపీ ఎప్పుడూ తెలంగాణకు మిత్రుడు కాదని విమర్శించారు. 2014 ఏపీ పునర్విభజన బిల్లులోనే సీట్ల పెంపు హామీ ఉందని గుర్తు చేశారు. కానీ ఇప్పటి వరకు ఆ హామీని నెరవేర్చలేదని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు బీఆర్ఎస్ అనుకూలమేనని, కానీ డీలిమిటేషన్ బిల్లులో మాత్రం తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.