జగన్‌కు 'క్రెడిట్ చోరీ డిజార్డర్': నారా లోకేశ్ ఎద్దేవా
- మెగా డీఎస్సీపై చర్చకు రావాలని వైఎస్ జగన్‌కు మంత్రి లోకేశ్ సవాల్
- టీడీపీ హయాంలో ఫ్యాక్టరీలు, వైసీపీ హయాంలో ఫ్యాక్షన్ వచ్చాయని ఆరోపణ
- రాష్ట్రం గాడిలో పడాలంటే కూటమి మరో మూడుసార్లు గెలవాలని వ్యాఖ్య
- కష్టపడి పనిచేసే కార్యకర్తలకు పదవులు వెతుక్కుంటూ వస్తాయని భరోసా
మెగా డీఎస్సీపై తాను చర్చకు సిద్ధమని, సమయం, తేదీ ఖరారు చేయాలని వైఎస్ జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ సవాల్ విసిరారు. తాను టెన్త్ తప్పిన బ్యాచ్ కాదని, స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేట్‌నని వ్యాఖ్యానించారు. గురువారం ఆదోనిలో జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... సైకోకు టీచర్లంటే కోపం కాబట్టే పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
"మెగా డీఎస్సీపై చర్చకు ఇది నా మూడో సవాల్. నేను చాలెంజ్ చేస్తే చెంచాలు బయటకు వస్తున్నారు. గ్రూప్-1 లీకేజీ, మద్యం కుంభకోణంపై కూడా చర్చిద్దాం. బాబాయి హత్య కేసులో సీబీఐ విచారణకు స్టే ఎందుకు తెచ్చుకున్నారు?" అని జగన్‌ను లోకేశ్ నిలదీశారు. 150 రోజుల్లో 250 కేసులు ఎదుర్కొని 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశామని, ఇప్పుడు ఆ నియామకాలను రద్దు చేయాలని వైసీపీ నేతలు కోర్టులో పిటిషన్ వేశారని ఆరోపించారు.
జగన్‌కు 'క్రెడిట్ చోరీ డిజార్డర్' అనే జబ్బు ఉందని, అందుకే తాము తెచ్చిన భోగాపురం ఎయిర్‌పోర్ట్, గూగుల్ వంటి ప్రాజెక్టులకు క్రెడిట్ తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో రాయలసీమలో ఫ్యాక్షన్ రాజ్యమేలితే, తమ హయాంలో ఫ్యాక్టరీలు, ఫైటర్ జెట్లు తెస్తున్నామని లోకేశ్ అన్నారు. రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ జగన్ అని, ఆయన హయాంలో అమర్ రాజా వంటి పరిశ్రమలను తరిమేశారని విమర్శించారు.
ఆర్థిక ఇబ్బందులున్నా ఎన్నికల హామీలను నెరవేరుస్తున్నామని, కార్యకర్తలకు అండగా ఉంటామని లోకేశ్ భరోసా ఇచ్చారు. కర్నూలుకు హైకోర్టు బెంచ్‌తో పాటు ఆదోనికి మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్, ఐటీఐ వంటివి మంజూరు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్, నియోజకవర్గ ఇన్‌చార్జి మీనాక్షి నాయుడు తదితరులు పాల్గొన్నారు.