ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, ల్యాప్‌టాప్‌లు ఉంటే ఉప్పల్ స్టేడియంలోకి అనుమతిలేదు!

Sunrisers Hyderabad vs Rajasthan Royals No Electronics Allowed at Uppal Stadium
  • రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్
  • 40 సీసీ కెమెరాలతో భద్రత పర్యవేక్షణ
  • నీళ్లసీసాలు, సిగరెట్లు, లైటర్లు ఉన్నవారికి స్టేడియంలోకి నో ఎంట్రీ
ఉప్పల్ వేదికగా మరికాసేపట్లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. మ్యాచ్ సందర్భంగా స్టేడియం వద్ద 2 వేలమంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 430 సీసీ కెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచే ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించారు. ల్యాప్‌టాప్‌లు, బ్యాగులు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, నీళ్లసీసాలు, సిగరెట్లు, లైటర్లు ఉన్నవారిని స్టేడియంలోకి అనుమతించలేదు.

ఈ స్టేడియం చుట్టుపక్కల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రేక్షకులకు ఇబ్బందులు లేకుండా 11 పార్కింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. మ్యాచ్ టిక్కెట్లు ఉన్నవారు మాత్రమే స్టేడియంకు రావాలని పోలీసులు మొదటి నుంచి విజ్ఞప్తి చేస్తున్నారు.

కాగా, సొంత మైదానంలో ఆడిన సన్ రైజర్స్ తొలి మ్యాచ్‌లోనే పరాజయం పాలైంది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన సన్ రైజర్స్ ఒక మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. మరోవైపు, రాజస్థాన్ ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు గెలిచి విజయోత్సాహంతో ఉంది.
Advertisement
Sunrisers Hyderabad
SRH
Rajasthan Royals
IPL 2024
Uppal Stadium
Hyderabad Cricket
Cricket Match

More Telugu News