వేల పాటల గాత్రానికి వందల కోట్ల ఆస్తులు.. ఆశా భోంస్లే ఆస్తులు ఎన్నంటే..!

Asha Bhosles Properties Worth Hundreds of Crores for Thousands of Songs
భారతీయ సంగీత ప్రపంచంలో తన గాత్రంతో ఎనిమిది దశాబ్దాల పాటు ఓ వెలుగు వెలిగిన దిగ్గజ గాయని ఆశా భోంస్లే.. విజయవంతమైన వ్యాపారవేత్తగానూ నిలిచారు. తన వారసులకు రూ.250 కోట్ల విలువైన వ్యాపార, ఆస్తిని ఆమె వదిలివెళ్లారు. ఆశా భోంస్లే మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ. 250 కోట్లు ఉంటుందని అంచనా. ఇందులో సింహభాగం రియల్ ఎస్టేట్ రూపంలోనే ఉంది. ముంబైలోని పెడర్ రోడ్, లోనావాలా వంటి అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఆమెకు రూ. వంద కోట్లకు పైగా విలువ చేసే నివాస గృహాలు ఉన్నాయి. వీటితో పాటు మెర్సిడెస్ బెంజ్, ఆడి వంటి విలాసవంతమైన కార్లు కూడా ఉన్నాయి.

గాయనిగానే కాకుండా వ్యాపార రంగంలోనూ ఆశా భోంస్లే తనదైన ముద్ర వేశారు. ‘ఆశాస్’ పేరుతో ఆమె స్థాపించిన రెస్టారెంట్ చైన్ అంతర్జాతీయంగా గొప్ప విజయం సాధించింది. దుబాయ్, కువైట్, బర్మింగ్‌హామ్, మాంచెస్టర్ వంటి నగరాల్లో ఈ రెస్టారెంట్లు ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఈ వ్యాపారం ద్వారా ఆమెకు గణనీయమైన ఆదాయం సమకూరింది.

ఈ ఆస్తులతో పాటు, వేల పాటల ద్వారా వచ్చే రాయల్టీలు కూడా ఆమె సంపదలో కీలక పాత్ర పోషించాయి. ఆమె నిర్మించిన ఈ వ్యాపార సామ్రాజ్యాన్ని ఆమె కుమారుడు ఆనంద్ భోంస్లే, మనవరాలు జానై భోంస్లే ముందుకు నడిపించనున్నారని తెలుస్తోంది. తన సంపదలో కొంత భాగాన్ని సంగీత పాఠశాలలు, సేవా కార్యక్రమాలకు కేటాయించేలా ఆశా భోంస్లే వీలునామా రాసినట్లు ఆమె సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.
Go Back to Shorts
Asha Bhosle
Asha Bhosle net worth
Asha Bhosle assets
Asha Bhosle properties
Asha Bhosle restaurants
Asha Bhosle legacy
Asha Bhosle real estate
Asha Bhosle son
Asha Bhosle granddaughter

More Telugu News