అభిషేక్ శర్మ ఊర మాస్ బ్యాటింగ్.. పవర్‌ప్లేలో సన్‌రైజర్స్‌ రికార్డు స్కోరు!

Abhishek Sharma Helps Sunrisers Hyderabad Smash Powerplay Record
ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి తన విధ్వంసకర బ్యాటింగ్‌తో అదరగొట్టింది. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పవర్‌ప్లేలోనే రికార్డు స్కోరు నమోదు చేసింది. కేవలం 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 105 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో పవర్‌ప్లేలో ఇదే సన్‌రైజర్స్‌కు అత్యధిక స్కోరు కావడం విశేషం.

న్యూ చండీగఢ్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. ముఖ్యంగా అభిషేక్ శర్మ ఊర మాస్ ఇన్నింగ్స్‌తో పంజాబ్ బౌలర్లపై సునామీ సృష్టించాడు. కేవలం 22 బంతులు ఎదుర్కొన్న అభిషేక్.. 7 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో 66 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 300 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతనికి మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (15 బంతుల్లో 31) కూడా చక్కటి సహకారం అందించాడు.

వీరిద్దరి ధాటికి పంజాబ్ బౌలర్లు తేలిపోయారు. అభిషేక్, హెడ్ జోడీ కేవలం 36 బంతుల్లోనే 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకోవడం తెలిసిందే.
Go Back to Shorts
Abhishek Sharma
Sunrisers Hyderabad
IPL 2024
Punjab Kings
Powerplay score
Travis Head
Cricket
T20
New Chandigarh
SRH

More Telugu News