హైదరాబాద్ శివార్లలో అగ్నికీలలు.. రెండు చోట్ల భారీ ప్రమాదాలు

Hyderabad Fire Accidents Two Major Fire Accidents in City Suburbs
షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో వరుసగా చోటుచేసుకుంటున్న అగ్ని ప్రమాదాలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. జీడిమెట్ల, దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రెండు వేర్వేరు భారీ అగ్ని ప్రమాదాలతో స్థానికులు భయంతో పరుగులు తీశారు.

వివరాల్లోకి వెళ్తే.. జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని రాంరెడ్డి నగర్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన సాల్వెంట్ డ్రమ్ముల గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. మంటల తీవ్రతకు కెమికల్ డ్రమ్ములు భారీ శబ్దాలతో పేలుతూ రోడ్లపైకి ఎగసిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలముకోవడంతో, స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

ఇదిలా ఉండగా, దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహదూర్‌పల్లి గ్రీన్ హిల్స్ కాలనీలో ఉన్న ఓ డెకరేషన్ సామగ్రి గోదాంలో మరో అగ్నిప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ వస్తువులు ఎక్కువగా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించి పక్కనే ఉన్న ఇంటికి కూడా అంటుకున్నాయి. కాలనీ మొత్తం దట్టమైన పొగ కమ్మేయడంతో ప్రజలు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు సంఘటనా స్థలాలకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
 
Go Back to Shorts
Hyderabad fire accidents
Hyderabad
fire accidents
Jeedimetla
Dundigal
Bahadurpally
chemical drums
solvent drums
decoration material
Green Hills Colony

More Telugu News