కాంగ్రెస్ నేత పవన్ ఖేరా కోసం అసోం పోలీసుల గాలింపు... హైదరాబాద్ వచ్చినట్టు అనుమానం!
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పవన్ ఖేరా కోసం అసోం పోలీసులు గాలిస్తున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రిణి భుయాన్‌కు మూడు పాస్‌పోర్టులు ఉన్నాయంటూ పవన్ ఖేరా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో అసోం పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆయనను విచారించేందుకు అసోం పోలీసులు వెతుకుతున్నారు.
నిన్న సాయంత్రం ఢిల్లీలోని నిజాముద్దీన్ ఈస్ట్ ప్రాంతంలోని పవన్ ఖేరా నివాసంలో పోలీసులు తనిఖీ చేశారు. ఇంటిలోని కీలక పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. సోదాలు జరిగినప్పుడు ఆయన ఇంట్లో లేరు. అసోం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో ఆయన సోమవారమే అసోం నుంచి వచ్చేశారని తెలుస్తోంది. ఆయన హైదరాబాద్‌కు వచ్చినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. కెమెరాలకు చిక్కకుండా ఆయన జాగ్రత్త పడుతున్నారని తెలుస్తోంది.
మీడియా కంట పడకుండా ఆయన కారులో ముఖం దాచుకున్నట్లు బీజేపీ 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేసింది. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ, పవన్ ఖేరా గౌహతి నుంచి హైదరాబాద్ పారిపోయారని విమర్శించారు. ఆయన విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు.