ఇరాన్‌పై సైనిక చర్యను రెండు వారాల పాటు నిలిపివేసిన ట్రంప్

Donald Trump Suspends Military Action Against Iran for Two Weeks
షార్ట్స్‌లో చూడండి
అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న తీవ్ర యుద్ధ వాతావరణం తాత్కాలికంగా చల్లబడింది. ఇరాన్‌పై చేపట్టాలనుకున్న సైనిక దాడులను రెండు వారాల పాటు నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. తాను విధించిన గడువు ముగియడానికి కేవలం 90 నిమిషాల ముందు ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠను తగ్గించింది.

పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ చేసిన అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' మీడియా ఖాతాలో వెల్లడించారు. అయితే, ఇరాన్ తక్షణమే హార్ముజ్ జలసంధిని రెండు వారాల పాటు సురక్షితంగా తెరవాలనే షరతుకు కట్టుబడి ఉండాలని ఆయన స్పష్టం చేశారు. దీనిని ఇరుపక్షాల కాల్పుల విరమణగా ఆయన అభివర్ణించారు.

ఈ ప్రకటనకు కొద్ది గంటల ముందు, 'ఈ రాత్రికి ఒక నాగరికత అంతరించిపోతుంది' అంటూ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అయితే, ఇరాన్ నుంచి వచ్చిన 10 సూత్రాల ప్రతిపాదన చర్చలకు ఆమోదయోగ్యంగా ఉందని ట్రంప్ పేర్కొనడంతో వాతావరణం మారింది.
 
 
Go Back to Shorts
Donald Trump
Iran
US Iran tensions
Military action
Shahbaz Sharif
Hormuz Strait
Pakistan

More Telugu News