Poladas Suresh: వామ్మో... ఎన్ని చలానాలో...!

Poladas Suresh Car Seized in Hyderabad with 95 Pending Traffic Challans
షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్ నగరంలో ఓ వాహనదారుడు ఏకంగా 95 ట్రాఫిక్ చలాన్లు బకాయిపడి పోలీసులకు చిక్కాడు. ఎల్‌బీనగర్ ట్రాఫిక్ పోలీసులు జరిపిన తనిఖీల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలదాస్‌ సురేశ్ అనే వ్యక్తికి చెందిన కారుపై సుమారు రూ.36,600 విలువైన 95 చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించి, వాహనాన్ని సీజ్ చేశారు.

ఎల్‌బీనగర్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు, ఎస్సై రవికుమార్ ఆధ్వర్యంలో విజయవాడ వెళ్లే మార్గంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో సురేశ్ కారును ఆపి రికార్డులు పరిశీలించగా భారీ సంఖ్యలో చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు తేలింది. ఓవర్‌ స్పీడింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, నో పార్కింగ్ వంటి పలు ఉల్లంఘనలకు ఈ చలాన్లు నమోదయ్యాయి.

గతంలో మూడుసార్లు సురేశ్ పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకున్నాడని అధికారులు తెలిపారు. అంతేకాకుండా, వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించాల్సిన వైట్ నంబర్ ప్లేట్ కారును, ఎల్‌బీనగర్ నుంచి సూర్యాపేటకు ప్రయాణికులను తరలించేందుకు ట్యాక్సీగా నడుపుతున్నట్లు కూడా గుర్తించారు. పెండింగ్ చలాన్లు చెల్లించాలని సూచించగా యజమాని నిరాకరించడంతో, పోలీసులు కేసు నమోదు చేసి కారును స్టేషన్‌కు తరలించారు. సురేశ్‌ను మంగళవారం కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు వెల్లడించారు.
 
Go Back to Shorts
Poladas Suresh
Hyderabad traffic challan
LB Nagar traffic police
Traffic violations
Over speeding
Wrong route driving
No parking
Vijayawada
Suryapet
White number plate

More Telugu News