Leander Paes: లియాండర్ పేస్ కు ఎక్స్ కేటగిరీ భద్రత.. బీజేపీలో చేరిన వెంటనే కేంద్రం నిర్ణయం
భారత టెన్నిస్ దిగ్గజం, ఇటీవల భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరిన లియాండర్ పేస్‌కు కేంద్ర ప్రభుత్వం ‘ఎక్స్’ కేటగిరీ భద్రతను కల్పించింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన భద్రతకు ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
గతంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో పనిచేసిన పేస్.. వారం క్రితమే ఢిల్లీలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన స్టార్ క్యాంపెయినర్‌గా పాల్గొననున్నారు. ఈ క్రమంలో ఆయనకు భద్రతాపరమైన ముప్పు ఉందని ఐబీ హెచ్చరించడంతో కేంద్రం వెంటనే స్పందించింది. ‘ఎక్స్’ కేటగిరీ భద్రత కింద ఇద్దరు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు షిఫ్టుల పద్ధతిలో 24 గంటలూ లియాండర్ పేస్‌కు రక్షణగా ఉంటారు.
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల సమయంలో తరచూ హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటాయి. ఈ నేపథ్యంలో బీజేపీ తరఫున ప్రచార బరిలోకి దిగుతున్న పేస్ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రం భావించింది. ముఖ్యంగా కోల్‌కతా వంటి పట్టణ ప్రాంతాల్లో లియాండర్ పేస్‌కు ఉన్న క్రీడాకారుడి ఇమేజ్‌ను ఓట్లుగా మలచుకోవాలని కమలం పార్టీ వ్యూహరచన చేస్తోంది. అయితే, రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే ఆయనకు భద్రత కల్పించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.