గిట్టుబాటు ధర కోసం పొగాకు రైతుల ఆందోళన.. జాతీయ రహదారి దిగ్బంధం
- గిట్టుబాటు ధర కల్పించాలని పొగాకు రైతుల డిమాండ్
- ప్రకాశం జిల్లాలో జాతీయ రహదారిపై రాస్తారోకో
- టంగుటూరు టోల్‌గేట్ వద్ద బైఠాయించిన అన్నదాతలు
- సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిరసన
- కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు
వర్జీనియా పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రకాశం జిల్లా రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టింది. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన ఈ నిరసన సెగతో జాతీయ రహదారిపై రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. రైతులు, రైతు సంఘాల నాయకులు భారీ సంఖ్యలో ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా తరలివచ్చి, టంగుటూరు టోల్‌ప్లాజా మరియు ముదిగొండ బ్రిడ్జి వద్ద జాతీయ రహదారిని దిగ్బంధించారు.
టోల్‌గేట్ వద్ద బైఠాయించిన రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. కష్టపడి పండించిన పంటకు సరైన ధర లభించక తీవ్రంగా నష్టపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కారణంగా చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.