Ruturaj Gaikwad: ఆర్సీబీతో పోరు... టాస్ గెలిచిన చెన్నై

CSK vs RCB Ruturaj Gaikwad Chooses Fielding After Winning Toss
షార్ట్స్‌లో చూడండి
ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) మధ్య ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ సీజన్‌లో వరుసగా రెండో విజయంపై ఆర్సీబీ కన్నేయగా, పాయింట్ల ఖాతా తెరిచేందుకు ఐదుసార్లు ఛాంపియన్ అయిన సీఎస్‌కే పట్టుదలగా ఉంది.

టాస్ గెలిచిన అనంతరం రుతురాజ్ మాట్లాడుతూ.. "ఇది హైస్కోరింగ్ మైదానం. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోంది. అందుకే ఆర్సీబీని వీలైనంత తక్కువ స్కోరుకే కట్టడి చేయాలని చూస్తాం. ధోనీ నెమ్మదిగా కోలుకుంటున్నాడు, ఆడేందుకు సిద్ధమయ్యాక త్వరలోనే జట్టులోకి వస్తాడు," అని చెప్పాడు. మరోవైపు ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ మాట్లాడుతూ.. "మేము కూడా బౌలింగ్ చేయాలనే అనుకున్నాం. కానీ పిచ్ గట్టిగా ఉండటంతో బ్యాటింగ్ చేయడం కూడా సంతోషంగానే ఉంది. గత మ్యాచ్‌లో మా వాళ్లు అద్భుతంగా ఆడారు, అదే జోరును కొనసాగిస్తాం," అని ధీమా వ్యక్తం చేశాడు. ఇరు జట్లు గత మ్యాచ్‌లో ఆడిన ఆటగాళ్లతోనే బరిలోకి దిగుతుండటం విశేషం.

ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లలో చెన్నై 21-13తో ఆధిక్యంలో ఉంది. అయితే చిన్నస్వామి స్టేడియం విషయానికొస్తే ఆర్సీబీ 6-5తో స్వల్ప ఆధిక్యం కనబరుస్తోంది. పిచ్ నివేదిక ప్రకారం, ఈ మైదానంలో బౌండరీలు చిన్నవిగా ఉండటంతో బ్యాటర్లకు పండగేనని, కొత్త బంతితో తొలి ఓవర్లలో వికెట్లు తీయడం కీలకం కానుందని విశ్లేషకులు అంచనా వేశారు.

చెన్నై సూపర్ కింగ్స్: సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, ప్రశాంత్ వీర్, జామీ ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కంబోజ్, మాట్ హెన్రీ, ఖలీల్ అహ్మద్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్ (కెప్టెన్), జితేశ్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాకబ్ డఫీ.
Go Back to Shorts
Ruturaj Gaikwad
Chennai Super Kings
Royal Challengers Bangalore
RCB vs CSK
IPL 2026
MS Dhoni
Rajat Patidar
M Chinnaswamy Stadium
IPL T20

More Telugu News