Shreyas Iyer: ఐపీఎల్-2026: సీఎస్కేపై టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ పోరులో పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని చెన్నై జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది.
టాస్ గెలిచిన అనంతరం శ్రేయాస్ అయ్యర్ మాట్లాడుతూ.. చెన్నైకి ఇది సొంత మైదానంలో తొలి మ్యాచ్ అని, వికెట్ తాజాగా ఉండటంతో బౌలింగ్ ఎంచుకున్నానని తెలిపాడు. పిచ్ ఎలా స్పందిస్తుందో ముందుగా తెలుసుకోవడం మంచిదని అభిప్రాయపడ్డాడు. గత మ్యాచ్‌లో లభించిన ఉత్సాహం ఈ మ్యాచ్‌లోనూ పనికొస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. తమ జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతున్నట్లు స్పష్టం చేశాడు.
మరోవైపు చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. పిచ్ పొడిగా కనిపిస్తోందని, రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని అన్నాడు. "బోర్డుపై పరుగులు ఉంచడం ముఖ్యం. గత మ్యాచ్‌లో జరిగిన పొరపాట్లను పక్కనపెట్టి, ఈ గేమ్‌పైనే దృష్టి పెట్టాం" అని చెప్పాడు. చెన్నై జట్టులో ఒక మార్పు చేసినట్లు తెలిపాడు. మాట్ షార్ట్ స్థానంలో ప్రశాంత్ వీర్‌ను జట్టులోకి తీసుకున్నట్లు వెల్లడించాడు.
జట్ల వివరాలు:
చెన్నై సూపర్ కింగ్స్: సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్, నూర్ అహ్మద్, అన్షుల్ కంబోజ్, మాట్ హెన్రీ, ఖలీల్ అహ్మద్.
పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), కూపర్ కనొలీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్‌సెన్, జేవియర్ బార్ట్‌లెట్, విజయ్‌కుమార్ వైశాఖ్, అర్ష్‌దీప్ సింగ్, యజువేంద్ర చాహల్.