చండీగఢ్ బీజేపీ కార్యాలయం వద్ద పేలుడు

Chandigarh BJP Office Blast Reported
  • పార్క్ చేసి ఉంచిన స్కూటీలో పేలుడు
  • సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసు బృందాలు, అగ్నిమాపక సిబ్బంది
  • భారీ మొత్తంలో నష్టం జరగలేదన్న బీజేపీ నాయకులు
చండీగఢ్ బీజేపీ కార్యాలయం వద్ద పేలుడు సంభవించింది. పార్క్ చేసి ఉంచిన స్కూటీలో పేలుడు చోటు చేసుకుంది. బీజేపీ పంజాప్ రాష్ట్ర కార్యాలయం వద్ద పేలుడు సంభవించిన విషయం తెలియగానే పోలీసు బృందాలు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. చండీగఢ్‌లోని సెక్టార్ 37లో సాయంత్రం 5 గంటల తర్వాత పేలుడు చోటు చేసుకుంది.

బీజేపీ సీనియర్ నాయకులు, కార్యాలయంలోని నాయకుల ప్రకారం, ఈ పేలుడు కారణంగా భారీ మొత్తంలో నష్టమేమీ జరగలేదు. విషయం తెలియగానే కార్యాలయం వద్దకు చేరుకున్న పోలీసులు, ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పేలుడుకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పంజాబ్ బీజేపీ మాజీ అధ్యక్షుడు అశ్వని శర్మ పేలుడుకు సంబంధించిన ఫొటోలను తన సామాజిక మాధ్యమ ఖాతాల ద్వారా పంచుకున్నారు.
Advertisement
Chandigarh BJP Office
Chandigarh
BJP Punjab
Scooty Blast
Explosion
Sector 37 Chandigarh

More Telugu News