బీహార్ ఆలయంలో తొక్కిసలాట.. ఎనిమిది మంది భక్తులు మృతి
- నలంద ఆలయంలో ఘోర విషాదం.. ప్రత్యేక ప్రార్థనల వేళ తొక్కిసలాట
- భద్రతా వైఫల్యమే కారణమని భక్తుల ఆరోపణ
- మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా, విచారణకు ఆదేశం
ఈ దుర్ఘటనకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి మంగళవారం ఆలయం వద్ద రద్దీ ఉంటుందని తెలిసినా, యంత్రాంగం తగిన భద్రతా ఏర్పాట్లు చేయలేదని ఆరోపిస్తున్నారు. ప్రమాద సమయంలో తగినంత మంది పోలీసులు లేరని, అంబులెన్స్‌లు కూడా ఆలస్యంగా చేరుకున్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఈ ప్రమాదంపై బీహార్ ఉప ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించినట్లు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.