Ravichandran Ashwin: ఐపీఎల్‌లో కొత్త రోల్.. సరికొత్త అవతారంలో రవిచంద్రన్ అశ్విన్
భారత వెటరన్ స్పిన్నర్, చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ తొలిసారిగా కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్ కోసం ఆయన కామెంటేటర్‌గా మారనున్నాడు. జియోస్టార్ బ్రాడ్‌కాస్టింగ్ బృందంలో చేరిన అశ్విన్, తన విశ్లేషణాత్మక నైపుణ్యాలతో అభిమానులను అలరించనున్నాడు. తన సుదీర్ఘ అనుభవంతో ఆటకు సంబంధించిన లోతైన విశ్లేషణలను పంచుకోనున్నాడు.
అశ్విన్‌తో పాటు జియోస్టార్ కామెంటరీ ప్యానెల్‌లో పలువురు దిగ్గజాలు ఉన్నారు. వీరేంద్ర సెహ్వాగ్, ఏబీ డివిలియర్స్, ఇర్ఫాన్ పఠాన్, సురేశ్ రైనా, హర్భజన్ సింగ్, ఫాఫ్ డుప్లెసిస్, అనిల్ కుంబ్లే వంటి భారత, ఐపీఎల్ స్టార్లు తమ గళం వినిపించనున్నారు. వీరితో పాటు రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్, మైఖేల్ క్లార్క్, ఇయాన్ మోర్గాన్, ఆరోన్ ఫించ్, డేల్ స్టెయిన్, కెవిన్ పీటర్సన్ వంటి అనుభవజ్ఞులైన బ్రాడ్‌కాస్టర్లు, మాజీ అంతర్జాతీయ స్టార్లు కూడా ఈ బృందంలో భాగమయ్యారు.
రోహిత్ శర్మ ఫామ్‌పై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
కామెంటేటర్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే అశ్విన్ తన విశ్లేషణకు పదునుపెట్టాడు. ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఫామ్‌పై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని ఐపీఎల్ సీజన్లుగా నిరాశపరుస్తున్న రోహిత్, ఈసారి మాత్రం అద్భుతంగా రాణిస్తాడని జోస్యం చెప్పాడు. తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ, ఈ సీజన్‌లో రోహిత్ చెలరేగడానికి అనేక సానుకూల అంశాలు ఉన్నాయని విశ్లేషించాడు.
"వ్యక్తిగతంగా ఈ సీజన్‌లో రోహిత్ నిజంగా చెలరేగుతాడని నేను భావిస్తున్నాను. అతనికి తగినంత విరామం దొరుకుతోంది. మానసికంగా చాలా ఉత్సాహంగా, తాజాగా ఉన్నాడు. శారీరకంగా కూడా చాలా ఫిట్‌గా కనిపిస్తున్నాడు. ఈసారి రోహిత్ శర్మ ఐపీఎల్‌లో తన పాత టీ20 బ్యాటింగ్‌ను తిరిగి తీసుకువస్తాడని నేను బలంగా నమ్ముతున్నాను" అని అశ్విన్ అన్నాడు.
"గత కొన్ని సంవత్సరాలుగా ఐపీఎల్ బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ అంతగా రాణించలేదనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. కానీ, తన ఫామ్‌ను తిరిగి పొందేందుకు ఇది అతనికి గొప్ప అవకాశం. ఈ సీజన్‌ను అతను ఆస్వాదిస్తూ ముంబై ఇండియన్స్ కోసం అద్భుతాలు చేయగలడు" అని అశ్విన్ పేర్కొన్నాడు. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్, రేపు ముంబైలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఆరో టైటిల్ వేటలో ఉన్న ముంబైకి రోహిత్ ఫామ్ అత్యంత కీలకం కానుంది.