Imran Khan: ఇమ్రాన్ ఖాన్ కోసం అంతర్జాతీయ వేదికపై కుమారుడి పోరాటం.. పాక్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ నిర్బంధంపై ఆయన కుమారుడు ఖాసిం ఖాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు. జెనీవాలో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (యూన్ఎన్ హెచ్చార్సీ) సమావేశంలో అతడు మాట్లాడుతూ.. తన తండ్రిని అక్రమంగా నిర్బంధించారని, పాక్ అధికారుల తీరు అంతర్జాతీయ మానవ హక్కుల ఒప్పందాలను ఉల్లంఘించేలా ఉందని ఆరోపించాడు. పాకిస్థాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలపై గళమెత్తాడు.
తన తండ్రి కేసు ఒక్కటే కాదని, 2022 నుంచి పాకిస్థాన్‌లో జరుగుతున్న విస్తృత అణచివేతకు ఇది ఒక ఉదాహరణ మాత్రమేనని ఖాసిం ఖాన్ అన్నాడు. రాజకీయ ఖైదీలను నిర్బంధించడం, సాధారణ పౌరులను మిలిటరీ కోర్టుల్లో విచారించి శిక్షించడం, జర్నలిస్టులను కిడ్నాప్ చేయడం లేదా దేశం విడిచి వెళ్లేలా ఒత్తిడి తీసుకురావడం వంటివి జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. తన తండ్రి ఇమ్రాన్ ఖాన్‌ను ఏకాంత నిర్బంధంలో ఉంచారని, కుటుంబ సభ్యులతో కలిసేందుకు కూడా అనుమతించడం లేదని, సరైన వైద్య సంరక్షణను నిరాకరిస్తున్నారని ఆరోపించాడు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందన్న పీటీఐ ఆరోపణలను ఖాసిం ఖాన్ ఉద్ఘాటించాడు. జీఎస్పీ-ప్లస్ ఫ్రేమ్‌వర్క్ కింద పాకిస్థాన్ అంగీకరించిన అంతర్జాతీయ మానవ హక్కుల ఒప్పందాలను ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని విమర్శించాడు. పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ దినపత్రిక 'డాన్' ఈ వివరాలను తన కథనంలో పేర్కొంది.
"నిజానికి నాకూ, మా సోదరుడికి రాజకీయాలంటే ఆసక్తి లేదు. ఇలాంటి వేదికల ముందుకు రావాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ, నా తండ్రి ప్రాణాల కోసం మేము చర్యలు తీసుకోవాల్సి వస్తోంది. ఆయన ఆరోగ్యం క్షీణిస్తుంటే, మమ్మల్ని కలవకుండా దూరం పెడుతుంటే మేము మౌనంగా ఉండలేం. మా స్థానంలో ఆయన ఉంటే, మాకు స్వేచ్ఛ లభించే వరకు పోరాటం ఆపేవారు కాదు. ఆయన కోసం మేం చేయగలిగిన కనీస సాయం ఇదే" అని ఖాసిం ఖాన్ ఉద్వేగంగా ప్రసంగించాడు.
మార్చి 21న తాను తన తండ్రితో మాట్లాడానని, ఆయన ఒక సందేశాన్ని ప్రపంచానికి తెలియజేయమని కోరారని ఖాసిం తెలిపాడు. "ఈ దేశంలోని న్యాయమూర్తులు సిగ్గుపడాలి. వారు తమ ఆత్మలను, సమగ్రతను అమ్ముకున్నారు. నన్ను మానసికంగా దెబ్బతీయలేక, నా భార్యను లక్ష్యంగా చేసుకున్నారు. నన్ను బ్లాక్‌మెయిల్ చేయడానికి బుష్రా బీబీ పట్ల ఇంత అమానవీయంగా ఎలా ప్రవర్తిస్తారు? ఆమెకు 24 గంటల ఏకాంతవాసం విధించారు" అంటూ ఇమ్రాన్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేసినట్లు ఖాసిం వెల్లడించాడు. 2023 ఆగస్టు నుంచి జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్, ప్రస్తుతం 14 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఆయన భార్య బుష్రా బీబీ కూడా ఓ అవినీతి కేసులో ఏడేళ్ల శిక్ష అనుభవిస్తున్నారు.