Mangli: ఆ వీడియోలకు, మాకు ఎలాంటి సంబంధం లేదు: మంగ్లీ

Mangli Clarifies No Connection to Microfinance Scam
షార్ట్స్‌లో చూడండి

ప్రముఖ గాయని మంగ్లీ పేరు చెప్పి కొందరు వ్యక్తులు మైక్రోఫైనాన్స్ పేరిట అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే వార్తలు కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై మంగ్లీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఒక సుదీర్ఘ అధికారిక ప్రకటన విడుదల చేసింది. తన ప్రొఫెషనల్ ఈవెంట్స్ మినహా తనకు ఎలాంటి ఇతర వ్యాపారాలు లేవని, ముఖ్యంగా మైక్రోఫైనాన్స్ రంగంతో తనకు కానీ, తన కుటుంబానికి కానీ ఎటువంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేసింది.


సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కరెన్సీ కట్టలకు సంబంధించిన వీడియోలకు, తన ఇంటికి ఎటువంటి సంబంధం లేదని మంగ్లీ క్లారిటీ ఇచ్చింది. కావాలనే తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కొందరు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని పోలీస్ శాఖను ఆమె కోరారు.


తన పేరు వాడుకుంటూ ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే నమ్మవద్దని మంగ్లీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తులతో తనకు ఎలాంటి పరిచయాలు లేవని తేల్చిచెప్పింది. తన తమ్ముడిని లేదా తనను కేవలం షోలు, ప్రొఫెషనల్ ఈవెంట్స్ కోసం మాత్రమే చాలా మంది సంప్రదిస్తుంటారని, అది కేవలం ఆ ప్రోగ్రామ్ ఆహ్వానాల వరకే పరిమితమని వివరించింది. అంతకు మించి వారి వ్యక్తిగత వ్యాపారాలతో తమకు సంబంధం లేదని పేర్కొంది.

Go Back to Shorts
Mangli
Mangli singer
Telugu singer Mangli
microfinance scam
Mangli controversy
illegal collections
social media
police investigation
fraud
Mangli official statement

More Telugu News