LaGuardia Airport: న్యూయార్క్ లో ఫైర్ ట్రక్కును ఢీకొట్టిన విమానం.. వీడియో ఇదిగో!

New York Plane Crash at LaGuardia Airport
షార్ట్స్‌లో చూడండి
న్యూయార్క్‌లోని లాగార్డియా విమానాశ్రయంలో శనివారం ఉదయం ఓ పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. టేకాఫ్ కోసం సిద్ధమవుతున్న విమానం ఒకటి అదుపుతప్పి, రన్‌వే పక్కన నిలిపి ఉంచిన ఎయిర్‌పోర్ట్ ఫైర్ ట్రక్కును బలంగా ఢీకొట్టింది. అయితే అదృష్టవశాత్తు ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు.

ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 71 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. విమానం ఫైర్ ట్రక్కును ఢీకొనగానే, సిబ్బంది వెంటనే అప్రమత్తమై అత్యవసర ద్వారాల ద్వారా ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. అయితే, ఫైర్ ట్రక్కులో ఉన్న ఇద్దరు అగ్నిమాపక సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి.

ఈ ప్రమాద తీవ్రతకు విమానం ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. రెక్క కూడా దెబ్బతింది. ప్రమాద స్థలం నుంచి దట్టమైన పొగలు రావడం, ప్రయాణికులు భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రమాదం కారణంగా అధికారులు ఒక రన్‌వేతో పాటు సమీపంలోని ర్యాంప్‌ను తాత్కాలికంగా మూసివేశారు. దీంతో పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ), నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (ఎన్ టీఎస్ బీ) అధికారులు దర్యాప్తు చేపట్టారు.
Go Back to Shorts
LaGuardia Airport
New York
Plane crash
Fire truck
FAA
NTSB
Aviation accident
Airport accident
Runway incident
Flight safety

More Telugu News