Laxman Sivaramakrishnan: కామెంటరీకి శివరామకృష్ణన్ గుడ్‌బై.. రంగు వివక్షే కారణమా?

Laxman Sivaramakrishnan Quits Commentary Alleging Racism
షార్ట్స్‌లో చూడండి
భారత మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ తన కామెంటరీ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించాడు. దాదాపు 23 ఏళ్లుగా వ్యాఖ్యాతగా కొనసాగుతున్న తనను పక్కన పెట్టడానికి 'రంగు వివక్ష' కూడా ఒక కారణమని ఆయన ఆరోపించడం క్రీడా వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. 

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్‌' వేదికగా శుక్రవారం తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించిన ఆయన, ఆ తర్వాత మరికొన్ని పోస్టులు చేశాడు. "గత 23 ఏళ్లుగా నన్ను టాస్‌లకు, ప్రజెంటేషన్ కార్యక్రమాలకు ఉపయోగించుకోలేదు. కొత్తగా వచ్చిన వారు పిచ్ రిపోర్టులు, ప్రజెంటేషన్లు చేస్తున్నారు. దీనికి కారణం ఏమై ఉంటుందని మీరు భావిస్తున్నారు?" అని ప్రశ్నించాడు. ఆయన పోస్టుకు ఒక నెటిజన్ స్పందిస్తూ, "బహుశా మీరు నల్లగా ఉండటం వల్లేమో" అని కామెంట్ చేశారు. దానికి శివరామకృష్ణన్ "మీరు చెప్పింది నిజమే. రంగు వివక్ష" అని బదులివ్వడం వివాదాన్ని మరింత పెంచింది.

ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో ఇవాళ‌ శివరామకృష్ణన్ మరోసారి స్పందిస్తూ తన ఆవేదన బీసీసీఐ మొత్తం పాలకవర్గంపై కాదని స్పష్టం చేశాడు. ఇది బీసీసీఐలోని ఒక ఉద్యోగితో తనకు ఉన్న వ్యక్తిగత సమస్య అని, ఈ వివాదంలో బీసీసీఐ కార్యదర్శి జై షాకు ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు. తన జీవితంపై తనకు నియంత్రణ తీసుకునే హక్కు ఉందని పేర్కొన్నాడు.

శివరామకృష్ణన్ ఆకస్మిక నిర్ణయంపై భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందిస్తూ, "ఓహ్ నో! ఈ ఐపీఎల్‌కు ఎందుకు ఉండరు?" అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. 2000వ సంవత్సరంలో కామెంటరీ కెరీర్ ప్రారంభించిన శివరామకృష్ణన్, అంతకుముందు ఐసీసీ క్రికెట్ కమిటీలో ఆటగాళ్ల ప్రతినిధిగా కూడా పనిచేశాడు.

1984లో ఇంగ్లండ్‌పై ఒకే మ్యాచ్‌లో 12 వికెట్లు పడగొట్టి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించిన శివరామకృష్ణన్, 1985లో సునీల్ గవాస్కర్ కెప్టెన్సీలో భారత్ గెలిచిన బెన్సన్ అండ్‌ హెడ్జెస్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కీలక పాత్ర పోషించాడు. ఆ టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచి సత్తా చాటాడు.
Go Back to Shorts
Laxman Sivaramakrishnan
Sivaramakrishnan commentary
Sivaramakrishnan retirement
BCCI
color discrimination
Ravichandran Ashwin
Sunil Gavaskar
Benson and Hedges Championship

More Telugu News