A-1 Fresh Chicken: హైదరాబాద్‌లోని ఏ-1 ఫ్రెష్ చికెన్ మార్ట్‌లో కుళ్లిన 610 కిలోల చికెన్ పట్టివేత

Rotten Chicken Seized at A1 Fresh Chicken in Hyderabad
షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్‌లో భారీ మొత్తంలో కుళ్లిన చికెన్‌ను పట్టుకున్నారు. ముషీరాబాద్ బాపూజీనగర్‌లోని ఏ-1 ప్రెష్ చికెన్ మార్ట్‌లో వారాసిగూడ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పోలీసులు సుమారు 610 కిలోల కుళ్లిన చికెన్‌ను గుర్తించారు. దుకాణ యజమాని షేక్ షకీల్ పాడైన చికెన్‌ను విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు.

తనిఖీల సందర్భంగా మాంసం దుర్వాసన రావడంతో పాటు ఎలుకలు, పిల్లులు సంచరించే అపరిశుభ్రత ప్రాంతంలో నిల్వ ఉంచినట్లు గుర్తించారు. దీంతో చికెన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా చికెన్ దుకాణం దుకాణ లైసెన్స్‌ను తనిఖీ చేయగా, గడువు ముగిసి ఏడాది దాటినా రెన్యూవల్ చేసుకోలేదని గుర్తించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Go Back to Shorts
A-1 Fresh Chicken
Hyderabad
Rotten Chicken
Musheerabad
Sheikh Shakeel
Food Safety
Police Raid

More Telugu News