సెలవులు లేవని తాత అనారోగ్యమంటూ డ్రామా.. మేనేజర్ ఒక్క ప్రశ్నతో షాక్!
- దుర్గాపూజ కోసం కోల్‌కతా వెళ్లాలనుకున్న ఉద్యోగి
- సెలవులు లేకపోవడంతో తాత అనారోగ్యమని అబద్ధం
- మెడికల్ ప్రూఫ్ అడిగిన మేనేజర్
- ఆధారాలు లేక ఇబ్బందుల్లో పడిన ఉద్యోగి
- రెడిట్‌లో సలహా కోరిన ఉద్యోగి. నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు
దుర్గాపూజను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవాలని ఓ ఉద్యోగి చేసిన ప్రయత్నం చివరకు చిక్కుల్లో పడేసింది. కోల్‌కతా వెళ్లేందుకు సెలవులు లేకపోవడంతో తాతకు అనారోగ్యంగా ఉందని మేనేజర్‌కు అబద్ధం చెప్పాడు. అయితే, వైద్యపరమైన ఆధారాలు పంపాలని మేనేజర్ కోరడంతో ఏం చేయాలో తెలియక ఆందోళనకు గురయ్యాడు. ఈ ఘటనపై రెడిట్‌లో జరిగిన చర్చ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
కోల్‌కతాకు వెళ్లి దుర్గాపూజ వేడుకల్లో పాల్గొనాలని ఆ ఉద్యోగి భావించాడు. అయితే, అప్పటికే అతడి పెయిడ్ లీవ్స్ పూర్తయ్యాయి. దీంతో జీతం లేని సెలవు అడగాల్సి వస్తుందని భావించి.. తాత అనారోగ్యంతో ఉన్నారని, ఇంటికి వెళ్లాల్సి ఉందని మేనేజర్‌కు చెప్పాడు. అవసరమైతే తాత్కాలికంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేందుకు అనుమతించాలని కోరాడు.
అయితే, ఈ వ్యవహారంపై ఈమెయిల్ పంపాలని, అందులో వైద్యపరమైన పత్రాలు జతచేయాలని మేనేజర్ సూచించారు. నిజానికి ఎలాంటి వైద్య అత్యవసర పరిస్థితి లేకపోవడంతో ఆ ఉద్యోగి వద్ద చూపించేందుకు ఎలాంటి పత్రాలూ లేవు. కంపెనీలో కొత్తగా చేరడంతో నిజం చెబితే తనపై చెడు అభిప్రాయం ఏర్పడుతుందేమోనని ఆందోళన చెందాడు. చేసిన తప్పును అంగీకరించి జీతం లేని సెలవు కోరాలా? లేక మరో మార్గం వెతకాలా? అంటూ రెడిట్‌లో సలహా అడిగాడు.
ఈ పోస్టుపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. వ్యక్తిగత సెలవుల కోసం ఉద్యోగులు కారణాలు చెప్పాల్సిన అవసరం లేని ఆరోగ్యకరమైన పని వాతావరణం ఉండాలని కొందరు అభిప్రాయపడ్డారు. మరికొందరు మాత్రం సెలవులు పూర్తయ్యాక అబద్ధం చెప్పడం ఉద్యోగి చేసిన తప్పేనని విమర్శించారు. ఇంకొందరు నకిలీ వైద్య పత్రాలు సమర్పించాలని సలహా ఇవ్వగా, మరికొందరు అలాంటి పని చేయకుండా తప్పును అంగీకరించాలని సూచించారు.