బాలీవుడ్ ఇండస్ట్రీలో 'హిందూ ఫోబియా' ఉంది: ఏక్తా కపూర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాలీవుడ్ ఇండస్ట్రీలో 'హిందూ ఫోబియా' ఉంది: ఏక్తా కపూర్

Ekta Kapoor says Hinduphobia exists in Bollywood industry
  • బొట్టు పెట్టుకుంటే తాంత్రికురాలు అన్నారన్న ఏక్తా కపూర్
  • మన జానపద కథలంటే ఇండస్ట్రీకి చిన్నచూపు అని విమర్శ
  • గుడి నుంచి క్లబ్‌కు వెళ్తే తప్పా? అని ప్రశ్న
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ సినీ పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో 'హిందూ ఫోబియా' (హిందూ వ్యతిరేకత) బలంగా పాతుకుపోయిందని ఆమె ఆరోపించారు. ఇటీవల తన కొత్త చిత్రం 'ది వాన్' ప్రమోషన్‌లో భాగంగా రణ్‌వీర్ అలహాబాదియా పాడ్‌కాస్ట్‌లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

పాశ్చాత్య ఫాంటసీ, యానిమేషన్ చిత్రాలను పరిశ్రమ తేలికగా అంగీకరిస్తుందని, కానీ భారతీయ జానపద కథలు, పురాణాలు, సంస్కృతి ఆధారంగా సినిమాలు తీస్తే మాత్రం అసౌకర్యంగా ఫీలవుతుందని ఏక్తా కపూర్ అన్నారు. తన కెరీర్ ప్రారంభంలో నుదుట బొట్టు, చేతికి ధాగా (దారం) కట్టుకున్నందుకు తనను చాలామంది వింతగా చూశారని, 'తాంత్రికురాలు', 'ఫ్రీక్' అని పిలిచారని ఆమె గుర్తుచేసుకున్నారు.

ఒకసారి గుడి నుంచి నేరుగా క్లబ్‌కు వెళ్లినప్పుడు కొందరు ఆశ్చర్యపోయారని, మత విశ్వాసాలు, ఆధునిక జీవనశైలి రెండూ కలిసుండకూడదా అని తాను ప్రశ్నించినట్లు ఏక్తా తెలిపారు. అయితే, ఇప్పుడు భారతీయ జానపద కథలకు ఆదరణ పెరగడం సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు.
Advertisement
Ekta Kapoor
Bollywood Hinduphobia
The Van Movie
Ranveer Allahbadia Podcast
Indian Folklore Mythology
Bollywood Industry News

More Telugu News