సరదాకి కూడా దాడులు చేస్తాం.. ఇరాన్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Donald Trump Says US Could Attack Iran for Fun
  • ఇరాన్‌లోని ఖర్గ్ ద్వీపంపై మరిన్ని దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరిక
  • ఇప్పటికే జరిగిన దాడుల్లో సైనిక లక్ష్యాలు ధ్వంసమయ్యాయని వెల్లడి
  • హర్మూజ్ జలసంధిలో జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని వార్నింగ్
ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌కు చెందిన కీలకమైన ఖర్గ్ ద్వీపంపై "సరదాకి కూడా మరికొన్ని దాడులు చేయొచ్చు" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఇప్పటికే అమెరికా జరిపిన దాడుల్లో ఖర్గ్ ద్వీపంలోని సైనిక లక్ష్యాలు చాలావరకు "పూర్తిగా ధ్వంసమయ్యాయి" అని ఆయన స్పష్టం చేశారు.

శని, ఆదివారాల్లో ఎన్‌బీసీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్'లో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణు కార్యక్రమాలు, క్షిపణి ముప్పులకు ప్రతిస్పందనగా ఇటీవల అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు ప్రారంభించాయి. ఇందులో భాగంగా మార్చి 13న ఖర్గ్ ద్వీపంపై అమెరికా వైమానిక దాడులు జరిపింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ తాజా హెచ్చరికలు జారీ చేశారు.

ఇరాన్ ముడి చమురు ఎగుమతుల్లో దాదాపు 90 శాతం ఖర్గ్ ద్వీపం నుంచే జరుగుతాయి. అయితే, అమెరికా దాడుల్లో తమ ఆయిల్ కేంద్రాలకు ఎలాంటి నష్టం జరగలేదని, కేవలం సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిగాయని ఇరాన్ మీడియా పేర్కొంది. హర్మూజ్ జలసంధిలో నౌకల స్వేచ్ఛా రవాణాకు ఇరాన్ ఆటంకం కలిగిస్తే, అక్కడి ఆయిల్ మౌలిక సదుపాయాలను కూడా లక్ష్యంగా చేసుకుంటామని ట్రంప్ హెచ్చరించారు. 
Go Back to Shorts
Donald Trump
Iran
Kharg Island
US Iran tensions
Iran nuclear program
US Israel joint attacks
Iran oil exports
Strait of Hormuz
Military targets
Crude oil

More Telugu News