తెలంగాణలో గ్యాస్ కొరత లేదు, వాణిజ్య సిలిండర్ల కొరత మాత్రం ఉంది: మంత్రి

Telangana
Advertisement
  • గ్యాస్ కొరతపై చమురు రంగ కంపెనీలతో సమీక్ష జరుపుతామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్యాస్ సరఫరా చేస్తామని హామీ
  • డీలర్లు బ్లాక్ మార్కెటింగ్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిక
తెలంగాణలో డొమెస్టిక్ గ్యాస్ కొరత లేదని, కేవలం వాణిజ్య సిలిండర్ల కొరత మాత్రమే ఉందని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సూర్యాపేటలో 'ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గ్యాస్ కొరతపై శుక్రవారం చమురు రంగ కంపెనీలతో సమీక్షిస్తామని అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తామని అన్నారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందిలేకుండా గ్యాస్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. గ్యాస్ సిలిండర్ల విషయంలో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. డీలర్లు బ్లాక్ మార్కెటింగ్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్యాస్ సరఫరాపై ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు.

ప్రజలు గ్యాస్ కొరతతో ఇబ్బందిపడుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మరో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఇద్దరు కేంద్రమంత్రులు, ఎనిమిది మంది ఎంపీలు ఉన్నా మన రాష్ట్రానికి కావాల్సిన గ్యాస్‌ను తీసుకురావడం లేదని విమర్శించారు. మున్ముందు ఎరువుల కొరత కూడా ఏర్పడే అవకాశముందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ చర్యలు తీసుకుంటోందని అన్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

Uttam Kumar ReddyTelangana gas shortageCommercial gas cylindersPonnam PrabhakarGas supply Telangana

More Telugu News

15 ఓవర్లు ఉండగానే మ్యాచ్‌ను ఎందుకు వదిలేశారు? తొలి టెస్టు డ్రాపై కెప్టెన్ గిల్ వివరణ

23 Nov, 11:41

బీఆర్ఎస్ నేతల నిర్బంధంపై మండిపడ్డ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి

23 Nov, 11:39

కోడింగ్, లెక్కలు అన్నీ ఏఐకేనా? ఇకపై మనుషులు గ్రంథాలు చదువుకోవాల్సిందేనా? జోహో బాస్ షాకింగ్ పోస్ట్!

23 Nov, 11:38

మేయర్ ప్రసంగం ఇస్తుంటే.. వెనుక వ్యక్తి వింత చేష్టల‌తో నెట్టింట 'ఏలియన్' అయిపోయాడు!

23 Nov, 11:37

శ్రీ సత్యసాయి బాబా జయంతి ఇకపై రాష్ట్ర పండుగ: నారా లోకేశ్

23 Nov, 11:36

పేదరికం అంటే డబ్బులు లేకపోవడమే కాదు.. లింక్డిన్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి పోస్ట్‌ వైరల్

23 Nov, 11:35

బిస్లరీపై ప్రాసిక్యూషన్‌కు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అనుమతి.. స్పందించిన యాజమాన్యం

23 Nov, 11:30

టీమిండియా గెలుపు ఆశలపై నీళ్లు చల్లిన న్యూజిలాండ్.. డ్రా తో ముగిసిన మొదటి టెస్ట్

23 Nov, 11:28

సన్నీ డియోల్ కొడుకుతో సారా టెండూల్కర్ పెళ్లి?.. అసలు నిజమిదే!

23 Nov, 11:27

ఫోన్ చేసి బయటకు పిలిచి.. సింగరేణి కార్మికుడి దారుణ హత్య

23 Nov, 11:25

50 లక్షల మందితో పోటెత్తనున్న అరుణాచలం.. గిరిప్రదక్షిణకు వెళ్లే భక్తులు ఈ టైమింగ్స్ గుర్తుంచుకోండి!

23 Nov, 11:19

మానవాళికి ప్రేమ, సేవలను నేర్పిన మహనీయుడు సత్యసాయి: చంద్రబాబు

23 Nov, 11:00

ఆసీస్ జట్టు మొత్తానికీ తెలుసు.. 'శాండ్‌పేపర్‌గేట్‌'పై ఏబీ డివిలియర్స్ సంచలన వ్యాఖ్యలు!

23 Nov, 10:33

పట్టణ జీవనంతో పేగులకు చేటు.. పెరుగుతున్న ఊబకాయం, షుగర్!

23 Nov, 10:31

ఒకవైపు ఎన్విడియా బాస్‌తో అఫైర్.. మరోవైపు చైనా నిఘా వర్గాలతో లింకులు! ఆలిస్‌పై సంచలన నివేదిక!

23 Nov, 10:25
..More Telugu News