Bangladesh vs Pakistan: పాక్‌ను చిత్తుగా ఓడించిన‌ బంగ్లాదేశ్

Bangladesh Cricket Team Wins Against Pakistan by 8 Wickets
  • తొలి వన్డేలో పాక్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి బంగ్లా
  • ఐదు వికెట్లతో పాక్‌ను దెబ్బతీసిన బంగ్లా పేసర్ నహిద్ రాణా
  • దూకుడైన హాఫ్ సెంచరీతో చెలరేగిన తన్జిమ్ హసన్ తమీమ్
  • ఇంకా 209 బంతులు మిగిలి ఉండగానే గెలిచిన బంగ్లాదేశ్
ఢాకా వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. పాక్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి సిరీస్‌లో శుభారంభం చేసింది. బౌలింగ్‌లో యువ పేసర్ నహిద్ రాణా, బ్యాటింగ్‌లో ఓపెనర్ తన్జిమ్ హసన్ తమీమ్ అద్భుతంగా రాణించి బంగ్లాకు సునాయాస విజయాన్ని అందించారు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బౌలింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై నహిద్ రాణా తన పేస్‌తో పాక్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ఐదు వికెట్ల ప్రదర్శనతో పాక్ పతనాన్ని శాసించాడు. దీంతో పాకిస్థాన్ జట్టు కేవలం 30.4 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది.

అనంతరం 115 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ ఓపెనర్ తన్జిమ్ హసన్ తమీమ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. పాక్ బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 42 బంతుల్లోనే 67 పరుగులు చేసి మ్యాచ్‌ను ఏకపక్షం చేశాడు. దీంతో బంగ్లాదేశ్ ఇంకా 209 బంతులు మిగిలి ఉండగానే కేవలం రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పాకిస్థాన్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది, మహమ్మద్ వసీమ్ చెరో వికెట్ పడగొట్టారు.
Bangladesh vs Pakistan
Bangladesh Cricket
PAKvBAN
Nahid Rana
Tanzim Hasan Tamim
Shaheen Afridi
Dhaka ODI
Bangladesh win
Cricket News
Pakistan Cricket Team

More Telugu News