'రణబాలి' సాంగ్ కి పెరుగుతూపోతున్న క్రేజ్!

Ranabaali Movie Song Update
  • చారిత్రక నేపథ్యంతో 'రణబాలి'
  • విజయ్ దేవరకొండ జోడీగా రష్మిక 
  • సంగీతాన్ని అందించిన అజయ్ - అతుల్ 
  • సెప్టెంబర్ 11వ తేదీన విడుదల

'రణబాలి' సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అటు విజయ్ దేవరకొండ అభిమానులు .. ఇటు రష్మిక ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. పెళ్లి తరువాత వాళ్లిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా ఇది కావడమే అందుకు కారణం. ఇటీవల విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి సందర్భంగా, ఈ సినిమా నుంచి ఒక సాంగ్ వీడియోను విడుదల చేశారు. ఇది పెళ్లి నేపథ్యంలో చిత్రీకరించిన పాట కావడం విశేషం. 

'ఏందయ్యో సామి' అంటూ ఈ పాట సాగుతుంది. అజయ్ - అతుల్ స్వరపరిచిన ఈ బాణీ, యూత్ కి చాలా ఫాస్టుగా కనెక్ట్ అయింది. రొమాంటిక్ మెలోడీగా సాగే ఈ పాటను చాలా అందంగా చిత్రీకరించారు. సాహిత్యం పరంగా కూడా ఈ పాట మంచి మార్కులు కొట్టేసింది. పెళ్లి సందర్భంలో వచ్చిన పాట కావడం వలన, ఈ పాట ఎక్కువమందికి రీచ్ అయ్యుండొచ్చని కొంతమంది అనుకున్నారు. అయితే రోజులు గడుస్తున్నా కొద్దీ ఈ పాటను ఆస్వాదించేవారి సంఖ్య పెరుగుతూ వెళ్లడం విశేషం. 

యూత్ ఇప్పుడు ఈ సాంగ్ ను ఎక్కువగా వింటోంది .. చూస్తోంది. ఈ మధ్య కాలంలో వచ్చిన మధురమైన మెలోడీగా ఈ పాటను గురించి చెప్పుకుంటున్నారు. ఆంగ్లేయుల కాలంలో వారి అరాచకాన్ని ఎదిరించి నిలిచిన ఒక రాయలసీమ వీరుడి కథ ఇది. ఆయన భార్య జయమ్మ పాత్రలో రష్మిక కనిపించనుంది. సెప్టెంబర్ 11వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.

Go Back to Shorts
Vijay Deverakonda
Ranabali movie
Rashmika Mandanna
Telugu songs
Romantic melody
Ajay Atul
marriage song
Telugu cinema
September 11 release
Jayamma role

More Telugu News