Ranveer Singh: 'ధురంధర్-2' ప్రభంజనం.. 45 దేశాల్లో సంచలనం!

Dhurandhar 2 Trailer Ranveer Singh Film Trending in 45 Countries
  • రణవీర్ సింగ్, డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్లో వస్తున్న 'ధురంధర్-2'
  • 48 గంటల్లో 312 మిలియన్ల వ్యూస్ సాధించిన ట్రైలర్
  • 45 దేశాల్లో యూట్యూబ్ ట్రెండింగ్‌లో అగ్రస్థానం  

బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మరో భారీ సునామీ రాబోతోంది. ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్, 'ఉరి' సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్: ది రివెంజ్’ (ధురంధర్ పార్ట్-2) ట్రైలర్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. మార్చి 7న విడుదలైన ఈ ట్రైలర్, కేవలం 48 గంటల్లోనే అన్ని ప్లాట్‌ఫామ్‌లలో కలిపి 312 మిలియన్ల వ్యూస్ సాధించి భారతీయ సినిమా చరిత్రలో కనీవినీ ఎరుగని రికార్డును నెలకొల్పింది. 45 దేశాల్లో యూట్యూబ్ ట్రెండింగ్‌లో అగ్రస్థానంలో నిలవడం ఈ సినిమాపై ఉన్న అంతర్జాతీయ క్రేజ్‌కు అద్దం పడుతోంది.


ఈ చిత్రంలో రణవీర్ సింగ్ ‘జస్కీరత్ సింగ్ రంగీ’, ‘హమ్జా’ అనే రెండు విభిన్న కోణాలున్న పాత్రల్లో కనిపిస్తుండటం అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. ముఖ్యంగా పాకిస్థాన్‌లోని ల్యారీ టౌన్ నేపథ్యంలో సాగే ఈ ప్రతీకార కథలో యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయని ట్రేడ్ వర్గాలు ప్రశంసిస్తున్నాయి. సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, అక్షయ్ ఖన్నా వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.


గతేడాది డిసెంబర్‌లో విడుదలైన మొదటి భాగం ఏకంగా రూ. 1,300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వస్తున్న ‘ధురంధర్ 2’ అంతకు మించిన రికార్డులను తిరగరాస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ ఉగాది, గుడి పడ్వా కానుకగా మార్చి 19న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Ranveer Singh
Dhurandhar 2
Aditya Dhar
Bollywood
Indian Cinema
Action Thriller
Spy Thriller
Box Office
Sanjay Dutt
Arjun Rampal

More Telugu News