శివాజీ తనయుడికి బ్రహ్మానందం కానుక

Brahmanandam gifts ring to Shivaji son
  • నటుడు శివాజీ, లయల 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' సినిమా ప్రీ రిలీజ్ వేడుక
  • ముఖ్య అతిథిగా హాజరైన హాస్యనటుడు బ్రహ్మానందం
  • వేదికపై శివాజీ కుమారుడికి ఉంగరాన్ని బహూకరించిన బ్రహ్మానందం 
  • మార్చి 6న థియేటర్లలోకి రానున్న సినిమా 
నటుడు శివాజీ, లయ ప్రధాన పాత్రల్లో నటించిన 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' సినిమా ప్రీ రిలీజ్ వేడుక మంగళవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 6న థియేటర్లలో విడుదల కానుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. 

హైదరాబాద్‌లోని దస్‌పల్లా హోటల్‌లో జరిగిన ఈ వేడుకలో నటుడు అలీ, చిత్ర బృందం, పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన ప్రసంగంలో బ్రహ్మానందం నటనలో అలీ తన కన్నా సీనియర్ అంటూ నవ్వులు పూయించారు. ఏ ఫర్ అలీ, బీ ఫర్ బ్రహ్మానందం అంటూ చమత్కరించారు. ఈ సందర్భంగా అడ్వాన్స్‌గా ఇస్తున్నానంటూ తన చేతి ఉంగరాన్ని తీసి శివాజీ తనయుడికి అందించారు. 
 
Go Back to Shorts
Brahmanandam
Shivaji
Sampradayini Suppini Suddapusan
Laya
Telugu Movie
Crime Comedy
Ali
Dasapalla Hotel Hyderabad
Pre Release Event

More Telugu News